విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో పిల్లలతో కలిసి నిద్రపోతున్న మహిళపై ఎదురింట్లో నివాసముండే ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే భర్తను అడ్డుకోవాల్సిన భార్య ఆ పని చేయకుండా… ఈ పాడు పనిని వీడియో తీయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన ఈనెల 3న జరిగినట్లు తెలుస్తోంది. నిందితుడు దిలీప్ అని.. వీడియో తీసిన అతడి భార్య తులసి అని పోలీసులు వెల్లడించారు. Read Also: వాలంటీరే కాలయముడు.. కల్తీ…
కర్ణాటకలో హిజాబ్ వివాదంపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ స్పందించారు. కర్ణాటకలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు అలజడి రేపేలా ఉన్నాయని కమల్ ట్వీట్ చేశారు. అమాయక విద్యార్థుల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో జరుగుతున్న ఇటువంటి పరిణామాలు తమిళనాడు వరకు పాకకుండా చూసుకోవాలని… తమిళనాడులో ప్రగతిని కోరుకునే వారు ఇటువంటి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కమల్ హాసన్ తన…
రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీ మండిపడుతోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా నల్లజెండాలతో నిరసలు చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అటు టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశవరావు మాట్లాడుతూ… పార్లమెంట్ ప్రొసీడింగ్స్‌ను ప్రధాని మోదీ మంట కలిపేలా మాట్లాడారని ఆరోపించారు. పార్లమెంట్ వ్యవహారాల్లో కోర్టుల జోక్యం సైతం ఉండదని.. పార్లమెంట్‌లో బిల్లు పాసింగ్ మాత్రమే ఉంటుందన్నారు. సైంటిఫిక్, అన్ సైంటిఫిక్…
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు తొలగిపోయినట్లే కనిపిస్తోంది. ఫిబ్రవరి తొలివారంలో కరోనా కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అయితే నిన్నటితో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం దేశవ్యాప్తంగా 67, 597 కరోనా కేసులు నమోదు కాగా బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన బులెటిన్ ప్రకారం 71,365 కేసులు వెలుగుచూశాయి. అంటే నిన్నటితో పోలిస్తే 4వేల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తాజా కేసులతో ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,10,976కి…
ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు త్వరలోనే భారీ ఎత్తున పదోన్నతులు లభించనున్నాయి. ఇందుకు సంబంధించిన నోట్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నోట్‌ను అన్ని జిల్లా, డివిజన్, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పంపించింది. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేయడం వల్ల వచ్చే జూన్‌లోగా 30వేల మంది SGTలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ రానుంది. Read Also: రూ.10 నాణేల చెల్లుబాటుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అటు రాష్ట్రంలో కొత్తగా…
వాలంటైన్స్ డే రోజు ఇస్రో సైంటిస్టులు కీలక ప్రయోగానికి రంగం సిద్ధం చేశారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ESO-04 లాంచింగ్‌ను ఫిబ్రవరి 14న జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 14న ఉదయం 5:59 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ-52 రాకెట్ ప్రయోగాన్ని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా నిర్వహించాలని తలపెట్టారు. పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో 1710 కిలోగ్రాముల ఉపగ్రహాన్ని 529 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సూర్య సమకాలిక ధ్రువ కక్ష్యలోకి ఇస్రో పంపనుంది. Read Also:…
కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఆ సంస్థ ఎండీ పార్థసారథితో పాటు పలువురు ఉన్నతాధికారులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో ఆ సంస్థ ప్రతినిధులు బెయిల్ రాక ఇప్పటికీ జైళ్లలోనే ఉన్నారు. తాజాగా రజినీ అనే వాటాదారు కార్వీ ఆస్తులు అమ్మకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీ (NCLT) విచారణ జరిపింది. Read Also: వాలంటీరే కాలయముడు.. కల్తీ కల్లు మరణాల కేసులో…
అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ విడుదలై 50 రోజులు దాటుతున్నా ఇంకా ఈ సినిమా మేనియా తగ్గడం లేదు. ఇప్పటికే ఈ మూవీలోని బన్నీ డైలాగులు, మేనరిజంలు ఎంతో పాపులర్ అయ్యాయి. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలువురు పుష్ప సినిమాలోని డైలాగులు, మేనరిజంలు ట్రై చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. క్రికెటర్ల దగ్గర నుంచి సాధారణ వ్యక్తుల దాకా పలువురు పుష్ప సినిమాలోని డైలాగులు, సాంగ్స్‌తో రీల్స్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు.…
తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో ఈనెల 2న కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. లోదొడ్డి గ్రామ వాలంటీర్ వంతల రాంబాబు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వివరాలను వారు వెల్లడించారు. మృతుల్లో ఒకరి భార్యతో రాంబాబు సన్నిహితంగా ఉండేవాడని.. గత నెలలో అతడు సన్నిహితంగా ఉన్న మహిళ మరిదితో గొడవ జరిగిన కారణంగా గ్రామ పెద్దలు…
అహ్మదాబాద్ వేదికగా ఈరోజు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉండటంతో ఈ వన్డేను కూడా గెలిచి సిరీస్ చేజిక్కించుకోవాలని టీమిండియా ఆరాటపడుతోంది. మరోవైపు ఈ వన్డేలో గెలిచి సిరీస్ సమం చేసి.. తద్వారా సిరీస్ సాధించాలనే ఆశలను సజీవంగా ఉంచుకోవాలని వెస్టిండీస్ భావిస్తోంది. దక్షిణాఫ్రికాలో పరాభవం తర్వాత రోహిత్ కెప్టెన్సీలో వెస్టిండీస్‌తో ఆడిన తొలి వన్డేలో…