Home
Latest Telugu News
Latest Telugu News News
-
‘జగనన్న చేదోడు’ నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
ఏపీలో జగనన్న చేదోడు పథకం రెండో ఏడాది నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నిధులను లబ్దిదారుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ పథకంలో భాగంగా రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10వేల ఆర్థిక సహాయం అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,85,350 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ మేరకు రూ.285.35 కోట్లను సీఎం జగన్ జమ చేశారు. Read Also: మహేష్‌బాబుతో… -
వెరైటీగా వెడ్డింగ్ రిసెప్షన్.. ఆసియాలోనే తొలిసారి
నేటి కాలంలో పెళ్ళిళ్లు కళ్లు చెదిరేలా జరుగుతున్నాయి. అయితే కరోనా పరిస్థితుల వల్ల వివాహాలు వినూత్నంగా వర్చువల్ పద్ధతిలో చేయడం చూస్తున్నాం. ఈ కోవలోకే మరో వివాహ వేడుక చేరింది. కోవిడ్ నిబంధనల దృష్ట్యా పరిమిత సంఖ్యతోనే తమిళనాడుకు చెందిన ఓ జంట వివాహం చేసుకుంది. కానీ మ్యారేజ్ రిసెప్షన్‌ని మాత్రం మెటావర్స్ టెక్నాలజీ సహాయంతో అంగరంగ వైభవంగా జరుపుకుంది. మెటావర్స్ టెక్నాలజీతో ఆసియా ఖండంలో జరిగిన తొలి వెడ్డింగ్ రిసెప్షన్ ఇదే కావడం విశేషం. శివలింగపురం… -
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన హీరో విజయ్.. కీలక ప్రకటన జారీ
తమిళనాడులో సినిమా వాళ్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తమిళ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిన సీఎంలు సినిమా వాళ్లే కావడం విశేషం. సినీ పరిశ్రమకు చెందిన కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలించిన వారిలో ప్రముఖులు. అనంతరం విజయ్ కాంత్, కమల్‌హాసన్ వంటి హీరోలు కూడా రాజకీయ పార్టీలను ప్రారంభించి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా స్టార్ హీరో విజయ్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేశాడు.… -
మహేష్‌బాబుతో నటించాలని ఉంది: ఎమ్మెల్యే రోజా
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరించే రోజాకు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు ఎమ్మెల్యేగా.. మరోవైపు టీవీ కార్యక్రమాలతో రోజా బిజీ బిజీగా కనిపిస్తుంటారు. తీరిక లేదు కాబట్టి ఇటీవల సినిమాల్లో నటించడం లేదు. గతంలో 100కు పైగా సినిమాల్లో నటించి తనకంటూ రోజా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తనకు ప్రస్తుతం ఉన్న హీరోల్లో మహేష్‌బాబు అంటే ఎంతో ఇష్టమని రోజా వెల్లడించారు. ఈ విషయాన్ని… -
సినిమా థియేటర్‌ను సీజ్ చేసే అధికారం తహసీల్దార్‌కు లేదు: హైకోర్టు
ఏపీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందన్న కారణంతో ఓ సినిమా థియేటర్‌ను తహసీల్దార్ సీజ్ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. సినిమా థియేటర్‌ను సీజ్ చేసే అధికారం తహసీల్దార్‌కు లేదని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలు పాటించని కారణంగా శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని శ్రీనివాసమహల్ థియేటర్‌ను సీజ్ చేస్తున్నట్లు గతంలో తహసీల్దార్ ప్రకటించారు. అయితే తహసీల్దార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ థియేటర్ యజమాని శంకర్‌రావు హైకోర్టును ఆశ్రయించాడు. Read Also: ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ.26వేల కోట్లతో… -
సామాన్యుడిపై మరింత భారం.. మళ్లీ పెరిగిన సిమెంట్ ధరలు
సామాన్యులకు సొంతింటి కల మరింత ప్రియం కానుంది. తాజాగా ఏపీ, తెలంగాణలో మరోసారి సిమెంట్ ధరలు పెరిగాయి. ఈనెల 1 నుంచి సిమెంట్ బస్తాపై రూ. 20 నుంచి రూ. 50 వరకు ధర పెంచినట్లు సిమెంట్ కంపెనీలు వెల్లడించాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 50 కిలోల బస్తా ధర బ్రాండ్ ఆధారంగా రూ.310 నుంచి రూ.400 వరకు పలుకుతోంది. సిమెంట్ ధరలు భారీగా పెరుగుతున్న కారణంగా ఇల్లు కట్టుకోవాలంటే పలువురు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.… -
రథసప్తమి సందర్భంగా నేడు ముచ్చింతల్‌లో ప్రత్యేక కార్యక్రమాలు
హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో శ్రీరామానుజచార్యుల సహస్రాబ్ధి సమారోహం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు రథసప్తమి సందర్భంగా ఏడోరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దుష్టగ్రహ బాధల నివారణ కోసం యాగశాలలో శ్రీ నారసింహ ఇష్టి కార్యక్రమం నిర్వహించనున్నారు. అటు సర్వవిధ పాప నివారణ కోసం శ్రీమన్నారాయణ ఇష్టి, లక్ష్మీనారాయణ మహాక్రతువు, చతుర్వేద పారాయణం చేపట్టనున్నారు. ప్రవచన మండపంలో శ్రీనారసింహ అష్టోత్తర శతనామావళి పూజతో పాటు సామూహిక ఆదిత్య పారాయణం సహా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. Read Also: మార్చి… -
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్లు.. గంటలోనే హాంఫట్
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌కు టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఈ మెగా టోర్నీని ఐసీసీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో మరోసారి రుజువైంది. అక్టోబర్ 23న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలు అలా మొదలయ్యాయో లేదో.. గంటల్లోనే టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. Read Also: యువ సంచలనం యష్ ధుల్‌ను ప్రత్యేకంగా గౌరవించిన ఐసీసీ తమ… -
ఏపీలో కొత్త జిల్లాల రగడ.. నేడు రాజంపేట బంద్
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు చోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అన్నమయ్య జిల్లాకు రాజంపేటను కేంద్రంగా ప్రకటించాలని జేఏసీ నాయకులు ఈరోజు బంద్‌కు పిలుపునిచ్చారు. రాయచోటి వద్దు-రాజంపేట ముద్దు అంటూ కొన్ని రోజులుగా స్థానికులు ఆందోళన చేపడుతున్నారు. అటు శ్రీసత్యసాయి జిల్లాకు పుట్టపర్తిని కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ అంశంపై ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మౌనదీక్ష కూడా చేపట్టారు. అటు హిందూపురం కేంద్రంగా జిల్లా కోసం ఆమరణ దీక్షకు… -
మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మిషన్ 2024 లక్ష్యంగా పోరాటాలు చేస్తామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీపీఐ జాతీయ కార్యదర్శి అమర్‌జీత్‌కౌర్ ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని శ్రామికవర్గం, ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ప్రజలను రక్షించండి.. దేశాన్ని కాపాడండి’ అనే నినాదంతో మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. Read Also: కొత్త ఒక వింత .. ఈ ఆధార్ కార్డు ఉంటేనే…
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!