అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ విడుదలై 50 రోజులు దాటుతున్నా ఇంకా ఈ సినిమా మేనియా తగ్గడం లేదు. ఇప్పటికే ఈ మూవీలోని బన్నీ డైలాగులు, మేనరిజంలు ఎంతో పాపులర్ అయ్యాయి. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలువురు పుష్ప సినిమాలోని డైలాగులు, మేనరిజంలు ట్రై చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. క్రికెటర్ల దగ్గర నుంచి సాధారణ వ్యక్తుల దాకా పలువురు పుష్ప సినిమాలోని డైలాగులు, సాంగ్స్‌తో రీల్స్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు. అటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నేతలు కూడా పుష్ప సినిమాలోని డైలాగులు చెప్తున్నారు.
Read Also: కర్ణాటకలో సెగలు రేపుతున్న ‘హిజాబ్’ వివాదం.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
తాజాగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నోట పుష్ప సినిమా డైలాగ్ వినిపించింది. ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. పుష్ప సినిమాలోని డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తమ ముఖ్యమంత్రి పుష్కర్‌ను ఓ పువ్వుగా భావిస్తోందని.. అయితే ‘అప్నా పుష్కర్ ఫ్లవర్ భీ హై ఔర్ ఫైర్ భీహై( మా పుష్కర్ పువ్వు మరియు నిప్పు) అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా ‘పుష్ప’ సినిమాలోని శ్రీవల్లి సాంగ్ ట్యూన్‌ను ఎన్నికల ప్రచారానికి వాడుకున్న సంగతి తెలిసిందే.