★ నేడు మరోసారి హైదరాబాద్ రానున్న ఏపీ సీఎం జగన్.. హైటెక్స్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి హాజరుకానున్న జగన్★ ఏపీ వ్యాప్తంగా పీఆర్సీపై ఉపాధ్యాయ సంఘాల నిరసనలు. 27 శాతానికి మించి ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్.. నేడు కలెక్టర్లకు వినతిపత్రాల సమర్పణ★ తూ.గో.: నేడు, రేపు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం.. అమలాపురం, రాజోలు, రావులపాలెం డిపోల నుంచి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ అధికారులు★ ప్రకాశం: ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో నేడు…
టాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలు, ఏపీలో టిక్కెట్ రేట్ల అంశంపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సినీ పెద్దలు సమావేశమయ్యారు. ఈ భేటీలో చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నటులు ఆర్.నారాయణమూర్తి, అలీ, పోసాని కృష్ణమురళి పాల్గొన్నారు. మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 14 రకాల విజ్ఞప్తులను టాలీవుడ్ బృందం సీఎంకు వివరించింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో హీరో మహేష్‌బాబు మాట్లాడాడు. ఆరు…
కరోనా కారణంగా వాయిదా పడ్డ నుమాయిష్‌ను ఈ నెల 20 నుంచి తిరిగి ప్రారంభించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ కొనసాగనుంది. ఇందుకోసం అన్ని శాఖల నుంచి అనుమతులు మంజూరైనట్లు తెలుస్తోంది. ఈమేరకు స్టాళ్ల నిర్వాహకులకు ఆహ్వానాలు పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒకవేళ స్టాళ్ల నిర్వాహకులు సిద్ధంగా లేకపోతే ఫిబ్రవరి 25 నుంచి నుమాయిష్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల నుంచి అనుమతులపై రెండురోజుల్లో…
రుణాలు తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఊరట కలిగించింది. ఆర్‌బీఐ వరుసగా పదోసారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సారథ్యంలోని మానిటీరీ పాలసీ కమిటీ గురువారం నాడు కీలక రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగానే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 4 శాతంగా వద్దనే ఉంది. రివర్స్ రెపో 3.35 శాతం వద్ద కొనసాగుతోంది. అదేసమయంలో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.25…
కర్ణాటకలో ప్రారంభమైన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ వివాదంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నుదుటన సింధూరం పెట్టుకోవడం తనకు ఇష్టమని.. అలాగే హిజాబ్ ధరించడం ముస్కాన్ వ్యక్తిగత స్వేచ్ఛ అని ఆమె వ్యాఖ్యానించారు. మహిళలకు ఏది సౌకర్యవంతంగా ఉంటుందో అదే నిర్ణయించుకోనివ్వండి.. మాకు నేర్పించకండి అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మహిళలు సృష్టికర్తలు అని, వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందన్నారు. ఈ…
ఏపీ ప్రభుత్వంలోని పలు శాఖలలో ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ విద్యార్థి సంఘాలు చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎక్కడికక్కడ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. పలుచోట్ల కలెక్టర్ కార్యాలయాలకు ర్యాలీగా వెళ్తున్న విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు ఈడ్చుకెళ్లారు. అయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు ఉద్యమాలు ఆపేది లేదని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి. ఉద్యోగ నోటిఫికేషన్‌లు వెంటనే విడుదల…
హైదరాబాద్ శంషాబాద్ శివారులో సమతా విగ్రహాన్ని ఇటీవల ప్రధాని మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే సమతా విగ్రహం తయారీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. బీజేపీ ఆత్మనిర్భర్ భారత్ అంటూ ప్రచారం చేసుకుంటోందని… సమతా విగ్రహాన్ని చైనాలో తయారుచేశారని.. ఆత్మనిర్భర్ భారత్ అంటే చైనాపై ఆధారపడటమా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఈ వ్యాఖ్యలతో…
రాష్ట్ర విభజనపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల విభజన అందరి అభిప్రాయాల మేరకు జరగలేదంటూ పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు గుర్రుమంటున్నారు. ఈ నేపథ్యంలో మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను ఇచ్చారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ కార్యాలయంలో రూల్ 187 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను టీఆర్ఎస్ ఎంపీలు అందజేశారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని అందులో పేర్కొన్నారు. తలుపులు…
తాను వ్యాపారంలో నష్టపోవడానికి ఆర్థికంగా చితికిపోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ కారణమంటూ యూపీలో ఓ చిరువ్యాపారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు ఫేస్‌బుక్ లైవ్‌లోనే విషం తాగాడు. వ్యాపారితో పాటు ఆయన భార్య కూడా విషం తాగింది. ఈ ఘటనలో భార్య చనిపోయింది. వ్యాపారి రాజీవ్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రధాని మోదీపై వ్యాపారి రాజీవ్ తీవ్ర ఆరోపణలు చేశాడు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల తాను అప్పుల పాలయ్యానని ఆవేదన వ్యక్తం…
దేశంలో ఆందోళన రేకెత్తించిన కరోనా థర్డ్ వేవ్ ముప్పు తొలగిపోయింది. బుధవారం కాస్త పెరిగిన కరోనా కేసులు గురువారం స్వల్పంగా తగ్గాయి. బుధవారం 71,365 కేసులు నమోదు కాగా గురువారం కొత్తగా 67,084 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,78,060కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1,241 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 5,06,520గా ఉంది.…