అహ్మదాబాద్ వేదికగా ఈరోజు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉండటంతో ఈ వన్డేను కూడా గెలిచి సిరీస్ చేజిక్కించుకోవాలని టీమిండియా ఆరాటపడుతోంది. మరోవైపు ఈ వన్డేలో గెలిచి సిరీస్ సమం చేసి.. తద్వారా సిరీస్ సాధించాలనే ఆశలను సజీవంగా ఉంచుకోవాలని వెస్టిండీస్ భావిస్తోంది. దక్షిణాఫ్రికాలో పరాభవం తర్వాత రోహిత్ కెప్టెన్సీలో వెస్టిండీస్‌తో ఆడిన తొలి వన్డేలో టీమిండియా పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది.
Read Also: రెండో వన్డేకు కేఎల్ రాహుల్ సిద్ధం.. ఇషాన్ కిషన్ అవుట్..!!
ఈ వన్డేకు ఓపెనర్ కేఎల్ రాహుల్ అందుబాటులోకి రావడంతో ఇషాన్ కిషన్‌పై వేటు పడేలా కనిపిస్తోంది. ఒకవేళ ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తే కేఎల్ రాహుల్ దీపక్ హుడా స్థానంలో మిడిలార్డర్‌లో ఆడే అవకాశముంది. మరోవైపు మాజీ కెప్టెన్ కోహ్లీకి ఇది కీలక మ్యాచ్. అతడు 71వ అంతర్జాతీయ శతకం కోసం కళ్లు కాయలు కాచేలా రెండేళ్లుగా వేచి చూస్తున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా తన సెంచరీ దాహాన్ని తీర్చుకోవాలని కోహ్లీ భావిస్తున్నాడు. కాగా గత 16 వన్డేల్లో 10 సార్లు వెస్టిండీస్ 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయలేదంటే ఆ జట్టు సామర్థ్యం ఎలా ఉందో అంచనా వేయవచ్చు. అందరూ హిట్టర్లు ఉన్నా వాళ్లు క్రీజులో నిలబడలేకపోవడం విండీస్ జట్టుకు మైనస్‌గా మారుతోంది.