మోస్ట్ పవర్ ఫుల్ వెపన్ ఇన్వెస్ట్ మెంట్. పెట్టుబడి పెట్టడం ద్వారా మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. ఈ రోజు మీరు చేసే పొదుపు ఫ్యూచర్ లో మీకు అండగా నిలుస్తుంది. ఆపద సమయంలో మీరు సేవ్ చేసుకున్న సొమ్ము ఆర్థిక భరోసాను ఇస్తుంది. ఆపద సమయంలో ఆర్థిక అవసరాలను తీరుస్తుంది. కుటుంబం అప్పులపాలు కాకుండా కాపాడుతుంది. మరి మీరు కూడా సంపాదించే దాంట్లో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీ కోసం పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. అదే పోస్ట్ ఆఫీస్ అందించే కిసాన్ వికాస్ పత్ర స్కీమ్.
READ MORE: YS Jagan: వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇప్పటి వరకు ఒకలా.. ఇకపై మరోలా చూస్తాం..
ఈ పథకంలో పెట్టుబడి పెడితే మీ డబ్బు డబుల్ అవడం ఖాయం. పెట్టుబడిపై మంచి రాబడిని పొందాలనుకునే వారు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఈ స్కీమ్ లో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు మంచి లాభాలను అందుకోవచ్చు. ప్రభుత్వ స్కీమ్ కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు. గ్యారంటీ రిటర్స్న్ అందుకోవచ్చు. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ లో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ నాటికి ఏకంగా రూ. 10 లక్షలు అందుకోవచ్చు. మరి ఈ పథకంలో ఎంత పెట్టుబడి పెట్టొచ్చు? మెచ్యూరిటీ కాలం ఎంత ఆ వివరాలు మీకోసం..
READ MORE: Chiranjeevi-Anil Ravipudi: చిరు-అనిల్ సినిమాకు ముహూర్తం ఫిక్స్?
రూ. 5 లక్షలకు 10 లక్షలు:
పోస్టాఫీస్ అందించే పథకాల్లో కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ పాపులారిటీ పొందింది. ఈ పథకంలో కనీసం రూ. 1000 నుంచి గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక్కరు లేదా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ పథకంలో వడ్డీ రేటు ప్రస్తుతం వార్షిక ప్రాతిపదికన 7.50 శాతంగా ఉంది. ఈ పథకంలో మీరు 115 నెలలు లేదా 9 ఏళ్ల 7 నెలల్లో పెట్టుబడిని రెట్టింపు చేసుకోవచ్చు. అంటే లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ నాటికి రూ. 2 లక్షలు అందుకోవచ్చు. రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 4 లక్షలు అందుకోవచ్చు. అదే రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 10 లక్షలు చేతికి అందుతాయి. ఈ స్కీమ్ ద్వారా లోన్ కూడా తీసుకోవచ్చు. బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో కిసాన్ వికాస్ పత్ర పథకం అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. వడ్డీ ద్వారా అధిక లాభాలను అందుకోవాలని చూసే వారికి ఈ పోస్టాఫీస్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ నూతన సంవత్సరంలో ఇన్వెస్ట్ మెంట్ స్టార్ట్ చేసి మీ ఫైనాన్షియల్ స్టేటస్ ను ఉన్నతంగా మార్చుకోండి.