Crime News: నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం సర్పంచ్ భర్త విజయ్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. పంటపొలాల్లో విజయ్ రెడ్డి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కొందరు వ్యక్తులు కారుతో అడ్డగించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ రెడ్డి బైక్‌ను అక్కడే వదిలేసి పంటపొలాల్లోకి పరిగెత్తగా.. కారులో వచ్చిన ఆ వ్యక్తులు కూడా అతడిని వెంబడించినట్లుగా ప్రాథమికంగా తెలిసింది. అతనిని పట్టుకుని ఆ వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్రగాయాలతో విజయ్ రెడ్డి ఘటనాస్థలంలోని ప్రాణాలు కోల్పోయారు.
Kodali Nani: అమ్మాయిల్ని అడ్డం పెట్టుకొని.. టీడీపీ కుట్రలు పన్నుతోంది
అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంతకు ముందు ఆయనతో గొడవలు పడిన వారిపై ఆరా తీస్తున్నారు. ఆయనను హత్య చేయడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుని శిక్షిస్తామని పోలీసులు వెల్లడించారు.