Olympics: క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో భాగం చేసేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సి్ల్ (ఐసీసీ) చాలా ఏళ్లుగా కృషి చేస్తోంది. నిజానికి 2024 పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి చాలా ప్రయత్నాలు జరిగినా ఇవి ఫలించలేదు. ఎట్టకేలకు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌కు చోటు ఉండవచ్చని తెలుస్తోంది. 2028 ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌ను చేర్చేందుకు ఐసీసీ ప్రయత్నాలు ముమ్మరం చేసిందంటూ బ్రిటీష్ వార్తాపత్రిక టెలిగ్రాఫ్ ప్రకటించింది. గత 100 సంవత్సరాలలో మొదటిసారిగా క్రికెట్‌ను ఒలింపిక్ క్రీడలలో చేర్చనున్నట్లు పేర్కొంది.
Read Also: Viral Video : టైపింగ్ లో అధికారి పొరపాటు.. కుక్కలా అరుస్తూ బాధితుడి నిరసన
చాలా ఏళ్లుగా ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలను చేర్చాలని అభిమానులు కోరుతున్నా ఐసీసీ పెడచెవిన పెట్టింది. కానీ టీ20 క్రికెట్ రంగప్రవేశంతో డిమాండ్ మరింత పెరిగింది. తక్కువ సమయంలో మ్యాచ్‌లు నిర్వహించడం టీ20 క్రికెట్ ప్రత్యేకత కావడంతో ఐసీసీ కూడా దీనిపై దృష్టి పెట్టింది. ఒలింపిక్ క్రీడలలో ఇప్పటివరకు క్రికెట్‌కు ఒక్కసారి మాత్రమే చోటు దక్కింది. 1900 ఒలింపిక్స్‌లో బ్రిటన్, ఫ్రాన్స్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్రిటన్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్ 2022లో మహిళల టీ20 క్రికెట్‌ను చేర్చారు. ఈ మెగా ఈవెంట్‌లో క్రికెట్ నిర్వహణ విజయవంతమైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడాయి. ఒక్కో గ్రూపులో నాలుగు జట్లను ఆడించారు. మరి ఒలింపిక్స్‌లో కూడా ఇదే ఫార్మాట్‌ను అవలంభించే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.