Central Government: ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరిని రాజ్యసభ వేదికగా వెల్లడించింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం ఉనికిలోనే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం నాడు రాజ్యసభలో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితుల రీత్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించిందని..…
Dinesh Karthik: టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వన్డేల్లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వన్డే కెరీర్ ముగిసినట్లేనని అభిప్రాయపడ్డాడు. బంగ్లాదేశ్ పర్యటన అనంతరం స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో భారత్ వన్డే సిరీస్‌లు ఆడాల్సి ఉందని.. ఆ టోర్నీలకు ధావన్ జట్టులో చోటు దక్కించుకుంటాడో లేదో వేచి చూడాలన్నాడు. ఒకవేళ ఆయా సిరీస్‌లకు ధావన్‌కు చోటు దక్కకపోతే వన్డే ప్రపంచకప్‌లో కూడా అతడి స్థానం గల్లంతయినట్లే భావించాల్సి ఉంటుందని…
Pawan Kalyan: కొన్నిరోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం వారాహిపై చర్చ నడుస్తోంది. ఆర్మీ కలర్‌లో వారాహి రంగు ఉండటం వివాదానికి కారణమైంది. వారాహి రంగుపై ఏపీలో అధికార పార్టీ నేతలు నేరుగా విమర్శలు చేశారు. అది వారాహి కాదని నారాహి అని.. ఆలివ్ గ్రీన్ రంగు కాకుండా పసుపు కలర్ వేసుకోవాలని చురకలు అంటించారు. అయితే ఏదేమైనా ప్రస్తుతం వారాహి వాహనం రిజిస్ట్రేషన్ వాయిదా పడింది. లారీ చాసిస్‌ను బస్సుగా మార్చడం, వాహనం…
Vijayawada: విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణలకు సిద్ధమైంది. ఈనెల 15 నుంచి 19 వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమాలు ఉంటాయని ఈవో భ్రమరాంబ తెలిపారు. ఈ సందర్భంగా భవానీ దీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కరోనా తరువాత ప్రస్తుత పరిస్థితి సాధారణం కావడంతో ఈ ఏడాది 7లక్షల మంది వరకు భవానీలు రావొచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఈనెల 15వ తేదీ ఉదయం 6గంటల నుంచి దీక్షల విరమణ ప్రారంభం…
Andhra Pradesh: మాండూస్ తుఫాన్ ఏపీలోని పలు ప్రాంతాల ప్రజలను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా 32 మండలాలలో తుఫాన్ ప్రభావం ఉంది. లోతట్టు ప్రాంతాల నుంచి 708 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. 33 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. 778 మందికి పునరావాసం కల్పించారు. ఈ నేపథ్యంలో మాండూస్ తుఫాన్ బాధితులకు ఏపీ ప్రభుత్వం సాయాన్ని విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వ్యక్తికి రూ.1000, కుటుంబానికి గరిష్టంగా రూ.2 వేల చొప్పున…
Botsa Satyanarayana: మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. ఈనెల 16 లేదా 17వ తేదీన వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ప్రత్యేకంగా వర్క్ షాప్ నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు. రానున్న ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేసుకోవడానికి విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీ బలోపేతం కోసం సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి వైసీపీ నేతలందరూ సమిష్టిగా పని చేయాలని బొత్స సూచించారు.…
Andhra Pradesh: ఏపీలో మరో ఉద్యమం పురుడు పోసుకుంటోంది. రీసర్వే పనుల్లో ప్రభుత్వం తెస్తున్న ఒత్తిడిపై ఏపీ వీఆర్వోలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 12 తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వీఆర్వోలు వెల్లడించారు. భోజన విరామ సమయంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా వీఆర్వోల సంఘం నేత భూపతిరాజు రవీంద్రరాజు మాట్లాడుతూ.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం…
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. SSMB28 పేరుతో వస్తోన్న ఈసినిమాపై మంచి అంచనాలున్నాయి.