What’s Today:
* నేడు గుంటూరులో సీఎం జగన్ పర్యటన.. ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారు, సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్న సీఎం జగన్
* అమరావతి: ఈరోజు ఉదయం 11 గంటలకు ఆర్ధిక శాఖ సీఎం జగన్ సమీక్ష.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, పథకాలకు నిధులపై సమావేశంలో చర్చ
* అమరావతి: నేడు మాజీ మంత్రి నారాయణ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో చిత్తూరు కోర్టులో బెయిల్ నిరాకరణ
* హైదరాబాద్: నేడు మల్లారెడ్డి తరఫున ఐటీ అధికారుల విచారణకు హాజరుకానున్న ఆడిటర్.. మెడికల్ సీట్ల కేటాయింపుపై ఐటీ అధికారుల ఆరా
* హైదరాబాద్: నేడు ఉదయం 10:30 గంటలకు కంటి వెలుగు పథకం ప్రారంభంపై అధికారులతో మంత్రి హరీష్‌రావు సమీక్ష సమావేశం
* ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఈరోజు బైంసా శివారులో బహిరంగ సభ
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో జగనన్న స్వర్ణోత్సవ సంస్కృతిక సంబరాలు.. సంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్ కె రోజా ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంబరాలు.. హాజరుకానున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ , హోంశాఖ మంత్రి తానేటి వనిత
* ఫిఫా ప్రపంచకప్‌లో నేడు: రాత్రి 8:30 గంటలకు ఈక్వెడార్ వర్సెస్ సెనెగల్, నెదర్లాండ్స్ వర్సెస్ ఖతార్.. రాత్రి 12:30 గంటలకు ఇంగ్లండ్ వర్సెస్ వేల్స్, ఇరాన్ వర్సెస్ అమెరికా