Covaxin: కొవాగ్జిన్ టీకాకు అనుమతిపై ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covaxin: రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొవాగ్జిన్ టీకాకు వేగంగా అనుమతి ఇచ్చారన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ఆరోపణలు తప్పుదోవ పట్టించే అసత్య వార్తలు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ బయోటెక్ తన టీకా తయారీలో కొన్ని ప్రక్రియలను వదిలేసిందని.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా క్లినికిల్ పరీక్షలను వేగవంతం చేసిందని మీడియాలో వచ్చిన వార్తలపై కేంద్రం వివరణ ఇచ్చింది. భారత ప్రభుత్వం, జాతీయ నియంత్రణ సంస్థ సీడీఎస్‌సీఓ కొవాగ్జిన్ టీకాకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చే సమయంలో శాస్త్రీయ విధానాలను, సంబంధిత నిబంధనలను పాటించినట్లు స్పష్టం చేసింది.
కాగా టీకా పరిజ్ఞానంపై ఏ మాత్రం అవగాహన లేనివారే ఆరోపణలు చేస్తున్నారని భారత్ బయోటెక్ సంస్థ అసహనం వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అధ్యయనాలు జరిగిన టీకాల్లో కొవాగ్జిన్ ఒకటి అని.. దీనిపై 20 ప్రీ క్లినికల్ అధ్యయనాలు నిర్వహించామని తెలిపింది. మూడు ఛాలెంజ్ ట్రయల్స్, 9 హ్యూమన్ క్లినికల్ స్టడీస్ చేపట్టామని వివరించింది. కొందరు వ్యక్తులు, కొన్ని బృందాలు కావాలనే కొవాగ్జిన్ టీకాపై బురద జల్లుతున్నాయని భారత్ బయోటెక్ మండిపడింది. టీకా అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాలనే ఒత్తిడి తమపై ఎప్పుడూ లేదని వివరించింది. వాస్తవానికి తామే అంతర్గతంగా కోవిడ్ మహమ్మారికి వేగంగా స్పందించామని భారత్ బయోటెక్ తెలిపింది. భద్రమైన, ప్రభావవంతమైన టీకా ఆవిష్కరించి ప్రజల ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతో పనిచేశామని పేర్కొంది.
Also Read
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే #COVAXIN టీకాకు హడావిడిగా రెగ్యులేటరీ ఆమోదం జరిగిందన్న మీడియా నివేదికలను ఖండించిన కేంద్ర ప్రభుత్వం.. ఇవి పూర్తిగా అవాస్తవాలు అని.. అత్యవసర వినియోగం కోసం కోవిడ్ టీకాలను అనుమతించేందుకు శాస్త్రీయ విధానం, నిబంధనలు పాటించామని వెల్లడి pic.twitter.com/gVidFaVLlR
— AIR News Hyderabad (@airnews_hyd) November 17, 2022
తాజావార్తలు
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
-
Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!