1) ఫేక్ కాల్స్ & మెసేజ్‌లను చెక్.. ట్రాయ్ కొత్త ప్రణాళిక
కొంతకాలం నుంచి సైబర్ నేరాలు ఎలా పెరిగిపోయాయో అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఆఫర్లు, బహుమతులు వచ్చాయంటూ.. ఫేక్ కాల్స్ లేదా ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ప్రజలకు టోకరా వేసి, సున్నితంగా దోచేసుకుంటున్నారు. వీటిని తిరస్కరిస్తున్నప్పటికీ.. మరింత ఊరించేలా సందేశాలు పంపుతూ, టెంప్ట్ చేస్తున్నారు. అప్పుడు వాళ్లు పంపిన లింక్స్ క్లిక్ చేస్తే మాత్రం.. మొబైల్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారంతో పాటు డబ్బులు కూడా మాటుమాయం అవుతాయి. ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో.. ఈ మోసాల్ని నిరోధించేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) రంగంలోకి దిగింది. ఒక కొత్త టెక్నాలజీపై పని చేస్తోంది. ఫేక్ కాల్స్‌తో పాటు ఎస్ఎంఎస్‌లను గుర్తించేందుకు.. ఇతర నియంత్రణ సంస్థలతో కలసి సంయుక్త కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు ట్రాయ్ తెలిపింది.
2) విశాఖ మహిళ అరుదైన ఘనత.. మిసెస్ ఆసియా టైటిల్ కైవసం
విశాఖకు చెందిన సఖినేటిపల్లి వాసి అల్లూరి సరోజ అరుదైన ఘనత సాధించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈనెల 19న జరిగిన మిసెస్ ఆసియా యూఎస్ఏ పోటీల్లో విజేతగా నిలిచారు. ఈ టైటిల్‌ను గెలుచుకున్న తొలి దక్షిణ భారత తెలుగు మహిళగా సరోజ నిలిచారు. ప్రధాన టైటిల్‌తో పాటు ఆమెకు ‘మిసెస్ పాపులారిటీ’, ‘పీపుల్స్ ఛాయిస్ అవార్డులు’ కూడా దక్కాయి. అల్లూరి సరోజ ఫైనల్‌కు ముందు జరిగిన వివిధ రౌండ్‌లలో పోటీ పడ్డారు.
3) చనిపోయిన వారిని మళ్లీ బతికించే సంస్థ.. ఎలాగంటే?
మృతి చెందిన వారు మళ్లీ తిరిగిరారన్న సంగతి అందరికీ తెలుసు. అందుకే, అంతిమ సంస్కారాలు చేసి, అక్కడితో వదిలేస్తాం. కానీ.. కొందరు మాత్రం చనిపోయిన తమ కుటుంబీకులు తిరిగొస్తారని ఆశతో ఎదురుచూస్తుంటారు. అలాంటి వాళ్ల కోసమే ఒక సంస్థ చనిపోయిన వారి శరీరాలను భద్రపరుస్తోంది. మృతి చెందిన వారు బతికి రావడం అసాధ్యమైనా, దాన్ని సాధ్యం చేయాలని ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. ఆ సంస్థ పేరు అల్కోర్ లైఫ్ ఎక్స్‌టెన్షన్ ఫౌండేషన్. ఇది అమెరికాలో ఉంది. చనిపోయిన మానవులు భవిష్యత్తులో ఎప్పటికైనా తిరిగొస్తారని ఆశతో ఎదురుచూస్తుంటారో, వారి మృతదేహాల్ని ఇక్కడ జాగ్రత్తగా భద్రపరుస్తారు.
4) రెండు దశాబ్దాల ‘ఖడ్గం’
దర్శకుడు కృష్ణవంశీ తన చిత్రాలలో దేశభక్తిని, జాతీయ సమైక్యతను, ఆదర్శభావాలను, పోరాట పటిమను పొందు పరుస్తూ సాగారు. ఆ తీరున ఆయన తెరకెక్కించిన ‘ఖడ్గం’లోనూ ఈ అంశాలన్నీ మనకు కనిపిస్తాయి. దుష్కర చర్యల ముష్యర మూకలు ఓ వైపు, దేశభక్తిని నింపుకున్న హృదయాలు మరోవైపు సాగించిన పోరాటంలో భారతీయులదే అంతిమ విజయం అంటూ ‘ఖడ్గం’ చిత్రం చాటింది. 2002 నవంబర్ 29న విడుదలైన ఈ మూవీ విజయం సాధించింది.
5) విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చిన ర్యాగింగ్ భూతం
ర్యాగింగ్ అనేది సరదాగా ఉండాలి. సీనియర్లు, జూనియర్లకు మధ్య బలమైన బంధం ఏర్పడే వారధిలా పని చేయాలి. కానీ.. కొందరు మాత్రం ర్యాగింగ్ పేరుతో దారుణాలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వేధింపులకు గురి చేస్తూ.. మానసికంగానే కాకుండా శారీరకంగానూ కుంగిపోయేలా చేస్తున్నారు. దీంతో వాళ్లు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకూ ఇలాంటి ఎన్నో సంఘటనలు జరగ్గా.. తాజాగా మరో ఉదంతం చోటు చేసుకుంది. సీనియర్ల ర్యాగింగ్‌ని తట్టుకోలేక, ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. రెండో అంతస్తు నుంచి దూకేశాడు. ఈ ఘటన అసోంలోని దిబ్రూగఢ్ యూనివర్సిటీలో జరిగింది.
6) కాశ్మీర్ ఫైల్స్ మూవీపై ‘ఇఫ్ఫీ’ జ్యూరీ సంచలన వ్యాఖలు
కాశ్మీర్ ఫైల్స్’ సినిమాకి రాజకీయ రంగు కూడా అంటుకుంది కాబట్టి రాజకీయంగా ఒక పార్టీని వ్యతిరేకించే వాళ్లు ఈ సినిమాని కూడా వ్యతిరేకించారు. ఈ వ్యతిరేక వర్గాల విమర్శలతో ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి వార్తల్లో ఉంది. తాజాగా మరోసారి ‘కాశ్మీర్ ఫైల్స్’ హాట్ టాపిక్ అయ్యింది. గోవాలో జరుగుతున్న ‘ఇఫ్ఫీ’ ఫిల్మ్ ఫెస్టివల్ చిరవి రోజున, జ్యూరీ హెడ్ ‘నాదవ్ లిపిద్’ మాట్లాడుతూ… “కాశ్మీర్ ఫైల్స్ ఒక వల్గర్, ప్రాపగాండా సినిమా అని మేము భావిస్తున్నాం. 53వ ఇఫ్ఫీ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉండాల్సిన సినిమా కాదు, ఆర్టిస్టిక్ కేటగిరిలో అలాంటి సినిమా చూసి షాక్ అయ్యాం. ఈ మాటని బహిరంగంగా చెప్పడానికి ఎలాంటి సంకోచం” లేదంటూ మాట్లాడాడు. ఇజ్రాయిల్ స్క్రీన్ రైటర్ అయిన ‘నాదవ్’ ఎంతోమంది ఇండియన్ మినిస్టర్స్, సినీ సెలబ్రిటీస్ ముందు ‘కాశ్మీర్ ఫైల్స్’ గురించి ఇలా మాట్లాడడం ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది.
7) ఒకే రోజు పెళ్లి చేసుకున్న ముగ్గురు క్రికెటర్లు
శ్రీలంక క్రికెట్‌లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒకేరోజు ముగ్గురు క్రికెటర్లు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. శ్రీలంక క్రికెటర్లు కసున్ రజిత, చరిత్ అసలంక, పథుమ్ నిశాంక సోమవారం నాడు కొలంబోలో వేర్వేరు చోట్ల వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి ఫొటోలను ఆ దేశ క్రికెట్ బోర్డు ట్విటర్‌లో పోస్టు చేసి శుభాకాంక్షలు తెలిపింది. వీరంతా ప్రస్తుతం అప్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఆడుతున్నారు. మొదటి వన్డేలో అఫ్ఘనిస్తాన్ గెలవగా, రెండో వన్డే వర్షంతో రద్దయ్యింది. మూడో వన్డే బుధవారం జరగనుంది. ఆ రోజు ఈ క్రికెటర్లు తమ జట్టుతో కలుస్తారు.