Traffic Special Drive: హైదరాబాద్ లో ఇవాళ్టి నుంచి ట్రాపిక్ రూల్స్ మరింత కఠినతరం కానున్నాయి. గీత దాటితే దాట తీస్తామంటున్నారు నగర ట్రాఫిక్ పోలీసులు. నగరంలో రాంగ్సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఉల్లంఘనలపై నేటి నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. వారం రోజులుగా ఈ ఉల్లంఘనలపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్పై రూ.1700, ట్రిపుల్ రైడింగ్పై రూ. 1200 ఫైన్ వేయనున్నారు. ఈ రెండు ఉల్లంఘనల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు ఇటీవల ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన అధ్యయనంలో తేలింది. ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తే భారీ ఫైన్లు తప్పవని హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ కంట్రోల్, ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్ ను మరింత పక్కాగా అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు.
Read also: CM KCR: నేడు దామరచర్లకు సీఎం కేసీఆర్.. యాదాద్రి థర్మల్ పనుల పురోగతిపై పరిశీలన
అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని సర్వేలో తేలడంతో ట్రాఫిక్ ఆంక్షలను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వ జీవో ప్రకారం ట్రాఫిక్ రూల్స్ అమలు చేస్తామని అడిషనల్ ట్రాఫిక్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుడు పట్టుబడితే, వాహనదారుడిపై గతంలో ఏవైనా చలాన్లు ఉన్నాయో లేదో పరిశీలించి చర్యలు తీసుకుంటారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, ఎక్కడికక్కడ వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నందున ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించారు.
Prabhas: కృతి సనన్ మనసులో ప్రభాస్… బయటపెట్టిన వరుణ్ ధావన్