Team India: టీమిండియాలో టీ20 ఫార్మాట్‌కు సంబంధించి ప్రస్తుతం వికెట్ కీపర్ స్థానం ఖాళీగా కనిపిస్తోంది. రిషబ్ పంత్ గాయం కారణంగా దూరం కావడంతో అతడి స్థానంలో ఇషాన్ కిషన్‌కు వరుస అవకాశాలను కట్టబెడుతున్నారు. అయితే అతడు ఒక్క మ్యాచ్ ఆడితే ఆరు మ్యాచ్‌లు ఆడకుండా జట్టును కష్టాల్లోకి నెడుతున్నాడు. వన్డేల్లో ఇటీవల డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ శ్రీలంకతో టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. 37 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితే…
Gudivada Amarnath: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలయ్య బాబు కాదని.. బాలయ్య తాత అని సంభోదించారు. బాలయ్యకు 60 ఏళ్లు దాటాయని.. బాలయ్య తాతను చూడటానికి ఎవరు వస్తారని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు అనుకున్నంత జనం రాలేదని.. బాలయ్య ఇంకా సమరసింహారెడ్డి కాదు ఇప్పుడు వీరసింహారెడ్డి అని గుడివాడ అమర్నాథ్ అన్నారు. జనాలు లేకే చంద్రబాబు, బాలయ్య బాబు రోడ్లపై…
Rishab Pant: రోడ్డుప్రమాదంలో గాయపడ్డ టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. మెరుగైన చికిత్స కోసం ఇటీవల పంత్‌ను డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్ నుంచి ముంబైలోని ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో పంత్ మోకాలికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. కారు ప్రమాదంలో పంత్ మోకాలి లిగ్మెంట్ తెగిపోయినట్టు డెహ్రాడూన్‌లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో తేలింది. దాంతో పంత్‌ను ముంబైకు ఎయిర్ లిఫ్ట్ చేశారు. శుక్రవారం నాడు పంత్…
కొత్త సంవత్సరం వేళ ఢిల్లీలో ఓ యువతిని కారుతో దాదాపు 13 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటనను మరువక ముందే మరో భయంకరమైన ఘటన హర్యానాలో జరిగింది. తన ద్విచక్రవాహనం ఎక్కడానికి నిరాకరించినందుకు ఓ వ్యక్తి ఓ మహిళను హెల్మెట్‌తో దారుణంగా చితకబాదాడు.
Winter Yoga: చలికాలంలో సాధారణంగా శరీరం బిగుసుకుపోతుంది. దీంతో కండరాల నొప్పులు వస్తుంటాయి. చలికాలంలో తగినంత సూర్యరశ్మి శరీరానికి తగలకపోవడంతో కండరాలకు సంబంధించి కొన్ని వ్యాధులు సంభవిస్తుంటాయి. అయితే చలికాలంలో కండరాలు బిగుసుకుపోకుండా ఉండాలంటే శరీరంలో వేడిని ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు యోగాసనాలు వేయాలని వైద్యులు సూచిస్తున్నారు. యోగాసనాలు వేయడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుందని.. తద్వారా ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వేలాది సంవత్సరాలుగా యోగా మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుందని…
Yogi Adiyanath: యూపీలోని లక్నోలో వచ్చే నెలలో పెట్టుబడిదారుల సదస్సు జరగనుంది. ఈ సదస్సును ప్రోత్సహించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం నాడు లక్నోకు వచ్చారు. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ సభ్యులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే యూపీనే గుర్తుకురావాలని సీఎం యోగి వ్యాఖ్యానించారు. యూపీలో వెబ్ సిరీస్ తీస్తే 50 శాతం, ఫిల్మ్ ల్యాబ్‌లు, స్టూడియోలు స్థాపిస్తే 25 శాతం సబ్సిడీ ఇస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. సమాజాన్ని ఏకం చేయడంలో,…
JC Prabhakar Reddy: ఏపీలో వైసీపీ సర్కారు వ్యవహారశైలిపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రజలు మాట్లాడే హక్కును కోల్పోయారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో స్వాతంత్ర్య సమరం నాటి పరిస్థితులు నెలకొన్నాయని.. సీఎం జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ వైఖరిని ప్రజలతో పాటు పశుపక్ష్యాదులు కూడా ఇష్టపడటం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని చెప్పారు. అసలు సొంత నియోజకవర్గం కుప్పంలో తిరిగే స్వేఛ్చ కూడా…
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ రిట్ పిటిషన్ ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఇప్పటికే ప్రభుత్వం తరపు వాదనలు పూర్తి కాగా. ప్రతివాదుల తరపు వాదనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. నేటి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి విచారణ చేపట్టనుంది.
Crime News: ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. గురువారం అర్ధరాత్రి మాణిక్యం అనే యువతిపై రాజులపాటి కల్యాణ్ అనే యువకుడు చాకుతో దాడి చేశాడు. అడ్డువచ్చిన మాణిక్యం చెల్లెలు వెంకట లక్ష్మీని, తల్లి భాగ్యలక్ష్మీపైనా సదరు యువకుడు చాకుతో దాడి చేశాడు. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకుని క్షతగాత్రులను స్థానికులు తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. Read Also:…
Andhra Pradesh: ఏపీలో సలహాదారుల నియామకాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాగే వదిలేస్తే భవిష్యత్‌లో కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, తహసీల్దార్లకు కూడా సలహాదారులను నియమిస్తారా అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సలహాదారుల నియామకానికి అంతు ఎక్కడ ఉందని మండిపడింది. ముఖ్యమంత్రి, మంత్రులకు సలహాదారులను నియమిస్తే అర్ధం చేసుకోగలం కానీ.. ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమించడం ఏంటని హైకోర్టు నిలదీసింది. సలహాదారుల నియామకం రాజ్యాంగ బద్దమో కాదో తేలుస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను…