Andhra Pradesh: ఏపీలో చాలా ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. గన్నవరం, రేణిగుంట, విశాఖ లాంటి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులతో పాటు పలు డొమెస్టిక్ ఎయిర్‌పోర్టులు కూడా ఉన్నాయి. అయితే ఈనెల 29న ఏపీలో జాతీయరహదారిపై విమానాలు ల్యాండ్ కానున్నాయి. విజయవాడ-ఒంగోలు మధ్య 16వ నంబర్ జాతీయ రహదారిపై విమానాలు ల్యాండ్ అవుతాయి. అయితే ఇది మాక్ డ్రిల్ మాత్రమే. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ విమానాల ల్యాండింగ్‌కు అనుకూలంగా ఉండేలా నేషనల్ హైవేలో కొంత మేర మార్పులు చేసింది. ఈ…
Yanamala: వైసీపీ ప్రభుత్వ పాలనపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. అప్పులపై అరగంటకో అబద్ధం.. గంటకో అప్పు, రోజుకో నిబంధన.. ఉల్లంఘన అనే విధంగా వైసీపీ పాలన సాగుతోందని యనమల ఆరోపించారు. అప్పులపై సీఎం జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కాగ్ అధికారుల సమక్షంలో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు యనమల తెలిపారు. రాజ్యంగబద్ధ సంస్థలైన కాగ్ వంటి వాటికి కూడా…
Drinking Alcohol: ఆల్కహాల్‌కు బానిసైన వాళ్లు జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. అటు కొంతమంది కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యానికి బానిసైన వ్యక్తికి అమ్మాయిలను ఇవ్వొద్దని కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ అన్నారు. మద్యానికి బానిసైన అధికారి కంటే ఒక కూలీ లేదా రిక్షా కార్మికుడిని పెళ్లికొడుకుగా ఎంపిక చేయడం మంచిదని చెప్పారు. తాను ఎంపీగా, తన భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా మద్యానికి అలవాటైన…
Andhra Pradesh: వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన నూతన బస్ టెర్మినల్‌ను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. మూడు రోజుల పర్యటన కోసం వైఎస్ఆర్ కడప జిల్లాకు విచ్చేసిన సీఎం జగన్ శనివారం నాడు పులివెందులలో నూతనంగా నిర్మించిన బస్ టెర్మినల్ ను ప్రారంభించారు. అనంతరం బస్ టెర్మినల్ ను సీఎం జగన్ స్వయంగా పరిశీలించి, ఆర్టీసీ కార్యాలయం, కాంప్లెక్స్ నిర్మాణ శైలిని ప్రయాణికుల సదుపాయాలను పరిశీలించారు. ప్రారంభోత్సవానికి ముందు సీఎం జగన్…
IND Vs BAN: మీర్పూర్ టెస్టులో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి టీమిండియా ఆపసోపాలు పడుతోంది. బంగ్లాదేశ్ విధించిన 145 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి కేవలం 45 పరుగులు చేసింది. కీలక ఆటగాళ్లు కేఎల్ రాహుల్ (2), శుభ్‌మన్ గిల్ (7), పుజారా (6), విరాట్ కోహ్లీ (1) పెవిలియన్ చేరారు. క్రీజులో అక్షర్ పటేల్ (26), జైదేవ్ ఉనద్కట్ (3) ఉన్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో…
CM Jagan: కడప జిల్లా పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. గ్లాస్‌లో 75 శాతం నీళ్లు ఉన్నా నీళ్లు లేవని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కావాలనే మన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనకు ఓటు వేయని వారికి కూడా మంచి చేస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. గతంలో ఇదే రాష్ట్రమని.. ఇదే బడ్జెట్…
IND Vs BAN: మీర్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 70.2 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. ఓవరాల్‌గా బంగ్లాదేశ్ 144 పరుగుల ఆధిక్యం సంపాదించింది. దీంతో టీమిండియా ముందు 145 పరుగుల టార్గెట్ నిలిచింది. లిటన్ దాస్ 73, జకీర్ హసన్ 51 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్, సిరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఉమేష్ యాదవ్, జైదేవ్ ఉనద్కట్…
Team India: టీ20 ప్రపంచకప్ తర్వాత బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు దిగింది. దీంతో సెలక్షన్ కమిటీని తొలగించింది. కొత్త సెలక్షన్ కమిటీ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు సెలక్షన్ ప్యానల్‌లోని ఐదు పోస్టుల కోసం 600 ఈమెయిల్ అప్లికేషన్లు వచ్చాయి. వీటిని ఓపెన్ చేసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీ పేరిట కూడా దరఖాస్తులు వచ్చాయి. అంతేకాకుండా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్…
Free Smart Phone: స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు నథింగ్ కంపెనీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నథింగ్ సంస్థ ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. తాజాగా ఈ బ్రాండ్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఉచితంగా స్మార్ట్ ఫోన్ పొందే అవకాశాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ట్విట్టర్లో ఒక కాంటెస్ట్ నిర్వహిస్తోంది. అందులో కేవలం తాము చేసిన ట్వీట్‌కు కామెంట్ చేస్తే సరిపోతుందని నథింగ్ కంపెనీ తెలిపింది. మీరు చేసిన…
Kapu Reservations: ఏపీలో కాపుల రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాపులకు 5శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో టీడీపీ ప్రభుత్వం చట్టం చేసింది. ఈ నేపథ్యంలో కాపులకు గత ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ చెల్లుతుందని, ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ల కల్పనకు తమ అనుమతి అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రానికి అధికారం ఉందని…