JC Prabhakar Reddy: ఏపీలో వైసీపీ సర్కారు వ్యవహారశైలిపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రజలు మాట్లాడే హక్కును కోల్పోయారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో స్వాతంత్ర్య సమరం నాటి పరిస్థితులు నెలకొన్నాయని.. సీఎం జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ వైఖరిని ప్రజలతో పాటు పశుపక్ష్యాదులు కూడా ఇష్టపడటం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని చెప్పారు. అసలు సొంత నియోజకవర్గం కుప్పంలో తిరిగే స్వేఛ్చ కూడా చంద్రబాబుకు లేదా అని జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు.
Read Also: Sunil Gavaskar: ప్రొఫెషనల్స్ ఇలాగే ఆడతారా? నోబాల్స్‌పై ఆగ్రహం
ఏపీలో పోలీసులే వైసీపీ కార్యకర్తల కంటే ఎక్కువగా వ్యవహరిస్తున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. చెత్త బండ్లను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని భవిష్యత్తులో పోలీసులే చెత్త ఎత్తుతారేమో అని చురకలు అంటించారు. కావాలంటే చెత్త ఎత్తుకోండి… మమ్మల్ని మాత్రం ఎత్తకండి అని ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాల్సిన అవసరం ఏర్పడిందని జేసీ ప్రభాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కుప్పంలో చంద్రబాబు పరిస్థితి చూస్తే చాలా బాధ కలిగిందన్నారు. అటు మార్చి నెల నాటికి రాష్ట్రంలో లోకల్ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లపై తీవ్ర ఆంక్షలు విధించే అవకాశం ఉందని జేసీ ప్రభాకర్‌రెడ్డి జోస్యం చెప్పారు.