What’s Today: * నెల్లూరు: నేడు టీవీఎస్ కళ్యాణ్ సదన్‌లో గోదాదేవి కళ్యాణం.. పాల్గొననున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు * నేడు రాజమండ్రి మున్సిపల్ స్టేడియంలో భారీ సెట్టింగ్స్‌తో సంక్రాంతి సంబరాలు.. తెలుగు వారి సాంస్కృతి, సంప్రదాయలను చాటి చెప్పుతూ, అంతరించిపోతున్న కళలను గుర్తుచేస్తూ ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న సంబరాలు * ప.గో.: నేటి నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి 59వ వార్షికోత్సవం మహోత్సవాలు * చిత్తూరు: నేడు నారావారిపల్లెలో నారా,…
ఇండియన్ సినిమా ఆర్.ఆర్.ఆర్ మరోసారి సత్తా చాటింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డును కైవసం చేసుకుంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ అవార్డును గెలుచుకుంది. ఈ పాటలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్నాయి.
What’s Today: * నేడు జగనన్న తోడు పథకం నిధులు విడుదల.. 3.95 లక్షల చిరు వ్యాపారులకు రూ.395 కోట్ల కొత్త రుణాలు.. గత ఆరు నెలలకు సంబంధించి రూ.15.17 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ * నేడు కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం.. హాజరుకానున్న ఏపీ, తెలంగాణ అధికారులు.. కృష్ణా జలాల్లో నీటి వాటాలపై చర్చ * తిరుమల: నేడు లక్కీ డీప్ ద్వారా భక్తులకు తిరుప్పావడ సేవా టిక్కెట్ల కేటాయింపు.. సా.5…
Telugu Desam Party: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ఇసుక, మద్యం, మారణాయుధాల సరఫరా, నకిలీనోట్లు, జిలెటిన్ స్టిక్స్ వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని ఉద్దేహాళ్ నుంచి తిమ్మలాపురం వరకు ఆయన ఆధ్వర్యంలో టీడీపీ నేతలు పాదయాత్ర…
* అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు స్త్రీ, శిశు సంక్షేమశాఖపై సీఎం జగన్ సమీక్ష.. అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చర్చ * తిరుమల: నేడు ఉ.9 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదల.. జనవరి 12 నుంచి ఫిబ్రవరి 21 వరకు సంబంధించిన టిక్కెట్ల కోటా విడుదల * విశాఖ: నేటి నుంచి సింహాచల దేవస్థానంలో ధారోత్సవాలు.. ఈనెల 13 వరకు ఆర్జిత నిత్య కళ్యాణం రద్దు * నేటి నుంచి…
మత మార్పిడి అనేది తీవ్రమైన సమస్య అని.. అది రాజకీయ రంగు పులుముకోకూడని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మోసపూరిత మత మార్పిడులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి, రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని దాఖలైన పిటిషన్‌పై అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సహాయాన్ని సోమవారం న్యాయస్థానం కోరింది.
Akkineni Nagarjuna: కన్నడ కస్తూరి పూజా హెగ్డే తెలుగులో డిమాండ్ ఉన్న హీరోయిన్స్‌లో ఒకరు. దాదాపు అగ్రహీరోలందరితో నటించిన పూజా అక్కినేని ఫ్యామిలీ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో, నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం’ చిత్రంలో నటించిన పూజ ప్రస్తుతం ఓ కమర్షియల్ యడ్‌లో నాగ్‌తో కలసి షూటింగ్‌లో బిజీగా ఉంది. శీతల పానీయానికి సంబంధించిన ఈ వాణిజ్య ప్రకటన హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది. అర్జున్ మాలిక్ దర్శకత్వం…
BCCI: రోడ్డుప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. ఈ సీజన్లో పంత్ ఆడకపోయినా పూర్తి జీతం అందించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో ఏ గ్రేడ్ ఆటగాడైన పంత్‌కు ఏడాదికి రూ.5 కోట్లు లభిస్తాయి. ఈ మొత్తాన్ని బీసీసీఐ అందజేయనుంది. దీంతో పాటు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడిగా పంత్‌కు రావాల్సిన రూ.16 కోట్లను నిబంధనల ప్రకారం జట్టుతో ఒప్పందం చేసుకున్న…
Andhra Pradesh Winter: దక్షిణ భారతదేశం మొత్తం చలి విజృంభిస్తోంది. దీంతో సాధారణం కంటే కనిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ మేరకు ప్రజలు చలితో గజగజ వణికిపోతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం మణ్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో చలి తీవ్రస్థాయిలో ఉంది. చింతపల్లిలో ముఖ్యంగా 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అటు హుకుంపేటలో 2.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఏజెన్సీలోని లంబసింగి వంటి కొన్ని ప్రాంతాల్లో…