హనీ రోజ్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒక్క సినిమాతో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. గత ఏడాది వీరసింహారెడ్డి మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. బాలయ్యకు జోడీగా నటించి టాలీవుడ్ లో సూపర్ పాపులర్ అయింది. వీర సింహారెడ్డి ఘన విజయం సాధించడంతో హనీ రోజ్ టాలీవుడ్ లో ఫుల్ బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు.. కానీ అలా జరగలేదు.. సోషల్ మీడియాలో మాత్రం బాగా బిజీగా ఉంటుంది.. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ లో తప్పితే…
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్ తో అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీ ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలని…
గత కొన్ని రోజుల నుండి అనగా ఈ నెల 25వ తేది నుండి గొంతు నొప్పి, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాని తెలంగాణ శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పత్రికా ప్రకటనను సోమవారం విడుదల చేశారు. వైద్యుల పర్యవేక్షణలో ఆ రోజు నుండి ఎలాంటి కార్యక్రమాలలో పాల్గొనకుండా చికిత్సపొందుతున్నానని ఆయన పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉండటం కారణంగానే గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26 వ తేదీ సాయంత్రం గవర్నర్ గారి “AT HOME” కార్యక్రమానికి కూడా వెళ్ళలేదని…
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎవరు అధైర్య పడవద్దు….119 సీట్లలో 39 సీట్లు గెలిచినం…బలమైన ప్రతిపక్షంగా ఉన్నామన్నారు. 14 సీట్లు ఐదు వేల ఓట్లతో ఓటమి పాలైనం…అందులో సగం గెలిచినా హంగ్ వచ్చేదని, 14 ఏళ్ళు అభివృద్ధి బాటలో కారు వంద కిలోమీటర్ల స్పీడ్ తో పోయిందన్నారు కేటీఆర్. కారు సర్వీసింగ్ కు పోయింది… మళ్లీ వంద స్పీడుతో దూసుకొస్తదని,…
టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొద్ది మంది సోషల్ మీడియా వీరులు కరెంటు సరఫరా పైన తప్పుడు ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు తో పాటు ఎటువంటి కోతలు లేకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం చీకట్లో ఉండాలని కలలు కంటున్న బిఆర్ఎస్ సోషల్ మీడియా వీరుల ఆశలను, అసలు స్వరూపాన్నిప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజల ప్రభుత్వమని,…
అగ్రరాజ్యం అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. నిరాశ్రయుడి ఆశ్రయం ఇచ్చి ఓ వ్యక్తిపై జాలి చూపిన భారత్‌కు చెందిన విద్యార్థి యూఎస్‌లో తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు.
భోపాల్‌లో నివసిస్తున్న హబీబ్ నాజర్ అలియాస్ మంఝాలే మియాన్‌ను మధ్యప్రదేశ్‌లోని పెద్ద వరుడు అని పిలుస్తారు. దీనికి కారణం 103 ఏళ్ల వయసులో వృద్ధుడు హబీబ్ 49 ఏళ్ల ఫిరోజ్ జహాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడు హబీబ్ ఒంటరితనాన్ని అధిగమించేందుకు ఈ వయసులో మూడోసారి పెళ్లి చేసుకున్నాడు.
కోమటిరెడ్డి, ఆయన అనుచరులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాని ఆయన తెలిపారు. మంత్రి అయిన తర్వాత బుద్ధి మారుతుంది అనుకుంటే ఇంకా హీనంగా ఉందని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. మాధవరెడ్డి పేరు చెప్పుకుని, ఆయన అనుచరులకు సిగరెట్లు మోసి బతికిన చరిత్ర వెంకట్ రెడ్డి ది అని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ నుండి తొలగిస్తాడనే దొంగ దీక్ష అని, రేవంత్ బెడ్ రూమ్ లోకి పోయి కాళ్లు పట్టుకుంటేనే వెంకట్ రెడ్డికి…
ప్రభుత్వ అధికారిణి అయిన భార్యను భర్త హత్య చేశాడు. మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలోని షాపురాలో పోస్ట్ చేయబడిన మహిళా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM)ని సర్వీస్, ఇన్సూరెన్స్, బ్యాంక్ రికార్డులలో నామినీగా చేయనందుకు ఆమె భర్త ఆమెను హత్య చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి సోమవారం తెలిపారు.
మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని అన్ని గొర్రెలు, మేకలు, పశువుల కబేళాలు, రిటైల్ మాంసం, గొడ్డు మాంసం దుకాణాలను జనవరి 30న మూసివేయనున్నారు. ఈ క్రమంలో, ఉత్తర్వులను అమలు చేయడంలో మున్సిపల్ సిబ్బందికి అవసరమైన సహకారం అందించడానికి సంబంధిత అధికారులను ఆదేశించాలని GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ GHMC పరిధిలోకి వచ్చే మూడు పోలీసు కమిషనరేట్లను అభ్యర్థించారు. ఇదిలా ఉంటే.. జీఓ ఎంఎస్ నెం 59 ప్రకారం ప్రభుత్వ భూముల…