రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమని మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి తెలిపారు. శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని గడియార స్తంభం సెంటరులోని వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం డ్వాక్రా బజారులో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను సకాలంలో అందించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు.
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్ సభ ఇంఛార్జుల్లో మార్పులపై కసరత్తు కొనసాగుతుంది. ఇవాళ ఐదవ జాబితా విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.
కృష్ణా జిల్లా వైసీపీలో బందరు ఎంపీ సీటు రచ్చ కొనసాగుతుంది. అయితే, బందరు ఎంపీ అభ్యర్థిగా వెళ్ళాలని అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ను వైసీపీ అధిష్టానం కోరింది. దీనికి అతడు స్పందిస్తూ.. తాను చిన్న వాడిని సరిపోనేమో మరోసారి ఆలోచన చేయాలని వైసీపీ అధిష్టానాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కోరినట్టు సమాచారం.
తొండపిలో ఎవరిమీద దాడి జరిగినా అది మంచి పద్దతి కాదు అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. తొండపి ఘర్షణలను ఖండిస్తున్నా.. నేను దాడి చేయించానని, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నాపై చేస్తున్న కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నాను.. ఎందుకంటే, తొండపి గ్రామం చాలా సున్నితమైన సమస్యాత్మక ప్రాంతం అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేపుతుంది. కాండ్రకోట గ్రామంలోని ఒక ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు, కుంకుమ, ఎండు మిర్చిలతో పూజలు చేసిన ఆనవాళ్లు గుర్తించిన స్థానికులు హడలిపోతున్నారు.
ప్రతి నెల నెల కొన్ని రూల్స్ మారుతుంటాయి.. అలాగే ఫిబ్రవరి 1 నుంచి కూడా కొన్ని కొత్త నిబందనలు అమల్లోకి రాబోతున్నాయని తెలుస్తుంది.. కొత్త బడ్జెట్ తో ఫిబ్రవరి నుంచి కొన్ని అంశాల్లో మార్పులూ రానున్నాయి. ఆ మార్పులేంటో తెలుసుకుందాం.. SBI హోమ్ లోన్స్.. ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాల పై భారీగా తగ్గింపును అందిస్తుంది.. 65 bps కంటే తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందిస్తోంది. హోమ్…
పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల సలార్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. భారీ కలెక్షన్స్ ను కూడా అందుకున్నాడు.. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. సలార్ పార్ట్ 2, కల్కి 2898 ఏడీ, రాజా సాబ్ వంటి సినిమాలు చేస్తున్నాడు. అలాగే ప్రభాస్ లైనప్ లో సందీప్ రెడ్డి వంగా, హను రాఘవపూడి వంటి దర్శకులు కూడా ఉన్నారు.. సీతారామం వంటి కల్ట్ క్లాసిక్ సినిమాతో…
అనర్హత పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. నేడు వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని వ్యక్తిగతంగా విచారించనున్నారు.
వచ్చే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రకటించాలని బీజేపీ అధిష్టానం యోచిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. రాష్ట్ర నాయకత్వం నాలుగు సిట్టింగ్ స్థానాలతో సహా 10 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిందని, మిగిలిన స్థానాలపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ హైకమాండ్కు పంపాల్సిన తుది జాబితా వచ్చే మూడు, నాలుగు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు…
గత ప్రభుత్వం జిల్లాలను మండలాలను అశాస్త్రీయంగా విభజించిందని… దీని సరిచేయడానికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిషన్ ను ఏర్పాటు చేయబోతుందని స్పష్టం చేశారు నీటిపారుదల & సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి…. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు జిల్లా పరిషత్ పాఠశాల వజ్రోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి… పొనుగోడును మండలంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పై స్పందిస్తూ…. ఆశాస్త్రీయంగా విభజించబడిన జిల్లాలను మండలాలను సరి చేసేందుకు త్వరలో కాంగ్రెస్…