కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు చాలా బాగుతున్నాయని, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలన్నది మంచి ఆలోచన అని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కితాబునిచ్చారు. సోమవారం నాడు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వీ హబ్ లో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్, బెంగళూరు కాన్సూలేట్ జనరల్ హిలరి మెక్ గెచ్చి రాష్ల్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన…
ఉగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(SIMI)పై భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. హోం మంత్రిత్వ శాఖ ఈ రోజు (జనవరి 29) ఈ సంస్థను కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం ప్రకారం దానిపై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు 'చట్టవిరుద్ధమైన సంఘం'గా ప్రకటించింది.
బీజేపీ మహిళ స్వయం సహాయక సంఘాలు, ఎన్జీఓస్ సంపర్క్ అభియాన్ ఆధ్వర్యంలో హయత్ నగర్ లోని ఓ హాల్ లో నిర్వహించిన కార్యశాల కార్యక్రమానికి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 1998లో స్వయం సహాయక సంఘాల కాన్సెప్ట్ ను వాజ్‌పేయి ప్రవేశ పెట్టారన్నారు. ఇప్పుడు వేలాది స్వయం సహాయక సంఘాల ఏర్పడ్డాయని, ఎన్ని కోట్ల సంఘాలు ఏర్పాటు చేసినా సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం…
సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి దామోదర రాజ నర్సింహ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం అధికారులను ఆదేశించారు.
ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ పై బీఆర్ఎస్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం పై బలపరీక్ష తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. పరిణామాలు వేగంగా మారుతున్నాయి. చైర్మన్ డివీ కి వ్యతిరేకంగా 19 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి అవిశ్వాస నోటీసు ఇచ్చిన నేపథ్యంలో.. ఫిబ్రవరి 5న ఇల్లెందు మున్సిపల్ ఆఫీసులో ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నోటీసు అందిన వెంటనే ప్రత్యేక క్యాంపుకు తరలిన బీఆర్ఎస్ కౌన్సిలర్లకు…
రాహుల్‌ది జోడో యాత్ర కాదు తోడో యాత్ర అని విమర్శలు గుప్పించారు బీజేపీ నేత మురళీధర్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఫిల్మ్ థియేటర్ లలో రిలీజ్ కు రెడీ కాలేదని, హోటల్ లకు, వర్చువల్ మీటింగ్ లకే పరిమితం అయిందన్నారు. కూటమి ఇప్పటి వరకు ఒక్క బహిరంగ సభ పెట్టలేదన్నారు మురళీధర్ రావు. అంతేకాకుండా.. ఏ అంశం లోనూ వారు ఏకాభిప్రాయం కి రాలేదని, రాహుల్ పశ్చిమ బెంగాల్ లోకి ఎంటర్…
ఉద్యోగం, ఆదాయం లేనందున తన భార్యకు భరణం చెల్లించలేనని భర్త చెప్పడం తగదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగం లేకపోయినా కూలి పనిచేసైనా విడాకులు తీసుకున్న భార్యకు భరణం చెల్లించాల్సిందేనని న్యాయస్థానం తీర్పునిచ్చింది. కూలి పనులు చేసైనా రోజుకు రూ.300 లేదా రూ.400 సంపాదించైనా భరణం చెల్లించాలని భర్తను కోర్టు ఆదేశించింది.
సనత్ నగర్ లోని తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో సోమవారం అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ప్రతి సెక్షన్ ను కలియ తిరిగి ఫైళ్ళను పరిశీలించారు. అధికారుల నుంచి వాటికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బయోమెట్రిక్ లో నమోదైన వివరాలతో కూడిన హాజరు పట్టికను పరిశీలించి కార్యాలయంలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎవరెవరు లీవ్ లో ఉన్నారో అగిడి…
వారం వారం కొత్త సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది.. అలాగే ఈ వారం ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’, ‘బూట్ కట్ బాలరాజు’ లాంటి చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా థియేటర్లలో విడుదల కాబోతున్నాయి.. ఇక ఈ వారం ఓటీటీలో విడుదల అయ్యే సినిమాల సంఖ్య ఎక్కువగానే విడుదల కానున్నాయి.. ఈ వారం ఏకంగా 21 సినిమాలు విడుదల కాబోతున్నాయి.. మెగాకోడలు లావణ్య త్రిపాఠి నటించిన ‘మిస్ ఫెర్ఫెక్ట్’ సిరీస్ అన్నింట్లో కాస్త ఆసక్తి కలిగిస్తోంది.…
దేశంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లోని 56 స్థానాలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనుండగా.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పోలింగ్ జరగనుంది.