ప్రజాబలం ఉన్న జగన్ పై ఎందుకు కక్ష కట్టారని, జగన్ పై అఘాయిత్యం చేయడానికి కుట్రాపన్నారని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ మరణం తర్వాత, జగన్ ప్రజల కష్టాలు తీర్చడానికి ముఖ్యమంత్రి అయ్యాడని, ఎన్నికల కు ముందు, జగన్ ను గద్దె దించడానికి ముందు కుట్ర పన్నారని ఆయన మండిపడ్డారు. మూడు పార్టీ లు కలసి వచ్చిన ఓడించ లేం అని భావించి ,ఇప్పుడు జగన్ పై మరో కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ ను ఏదో ఒక రకం గా హతమార్చాలని కుట్ర చేస్తున్నారని, చంద్రబాబు,పవన్ కల్యాణ్ లకు చెప్తున్నా మరొక రాయి జగన్ పై పడితే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరని ఆయన అన్నారు.
అంతేకాకుండా..’మా జగన్ ను తాకితే చాలు,కళ్ళారా చూస్తే చాలు అనుకునే ప్రజలు ఉన్నారు…. ఆ ప్రజాభిమానం జగన్ కు ఉందన్న విషయం తట్టుకోలేక చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నారు… వైసిపి కార్యకర్తలు,అప్రమత్తం గా ఉండాలి… విజయవాడ లో ఎందుకు జగన్ పై దాడి చేసారు… విజయవాడ మీ అడ్డా నా?
పవన్ కళ్యాణ్ మాటలు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు.. జగన్ తో పవన్ కళ్యాణ్ ను పోల్చుకుంటున్నాడు… తెనాలి లో నాలుగో పెళ్ళాం నాదెండ్ల మనోహర్ ను గెలిపించమని పవన్ కల్యాణ్ వెళ్ళాడు… మనోహర్ తెనాలి లో గెలవడు…. మనోహర్ గతం లో చేసిన అవినీతి నీ తెనాలి ప్రజలు మార్చి పోరు… చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దాస్యం చేసేకంటే చచ్చిపోవడం మంచిది… పవన్ కళ్యాణ్, చంద్రబాబు మోచేతి నీళ్లు తాగడం ఆపాలి…’ అని అంబటి రాంబాబు అన్నారు.