CM Jagan : సీఎం జగన్‌పై దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విజయవాడ నగరంలో ‘మేమంతా సిద్ధం’ రోడ్‌షో నిర్వహిస్తుండగా శనివారం రాత్రి సింగ్‌నగర్ డాబా కొట్ల రోడ్డులో రాయి తగిలి సీఎం నుదుటిపై గాయమైన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన ప్రాంతంలో అనుమానితుల కదలికలపై స్థానికుల నుంచి స్టేట్ మెంట్లు రికార్డ్ చేసిన పోలీసులు.. గత వారం రోజులుగా పదే పదే స్థానికంగా తిరిగిన వారి వివరాలు సేకరిస్తున్నారు. ఘటన జరిగిన స్థలంలో ఉన్న సెల్ టవర్స్ నుంచి దాడి తర్వాత ఎక్కువ సార్లు మాట్లాడిన ఫోన్ కాల్స్ పై టెక్నికల్ టీమ్ ఫోకస్ చేసింది. వివేకానంద స్కూల్ ప్రాంగణం నుంచే దాడి జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. రౌడీ షీటర్లతో పాటు, గంజాయి, చెడు వ్యసనాలు తిరిగి ఆవారా బ్యాచ్ లను పోలీసు బృందాలు విచారిస్తున్నాయి. 24 సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలించి అనుమానితులను గుర్తించే పనిలో ఉంది క్లూస్ టీమ్. బస్సు కి 20 నుంచి 30. అడుగుల దూరం నుంచే దాడి జరిగినట్టు గుర్తించిన పోలీసులు.. ఈ తరహా దాడులకు పాల్పడే పాత నేరస్తులను విచారిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం పశ్చిమ డీసీపీ హరికృష్ణ నేతృత్వంలో 20 మందితో కూడిన ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఇందులో ఆరు బృందాలు పనిచేస్తున్నాయి. లా అండ్ ఆర్డర్, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సభ్యులుగా ఉన్న ఈ బృందాలు ఆధారాల కోసం అన్వేషణ ప్రారంభించాయి.
Also Read
- Big Rain Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి ముంచుకొస్తున్న మరో తుఫాన్ ముప్పు..
- Raptadu School Attack: "కన్నీళ్లు ఆగడం లేదు".. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
- Raptadu School Attack: బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?
- Bangladesh: ‘‘ఢిల్లీనా.. ఢాకానా?’’ బంగ్లాదేశ్‌లో మళ్లీ భారత్ వ్యతిరేక నినాదాలు
తాజావార్తలు
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!