గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఒకవైపు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తూనే.. వార్ 2 సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. వార్ 2 మొదటి షెడ్యూల్ ఇటీవలే మొదలైంది. ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల 10 రోజుల షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబైలో అడుగుపెట్టారు.. ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది..
ఈ భారీ యాక్షన్ సినిమాలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి నటిస్తుందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.. యానిమల్ సినిమాతో ఈ అమ్మడు యూత్ క్రష్ గా మారిపోయింది.. ఒక్క సినిమాతో బాగా పాపులర్ అయ్యింది.. అంతేకాదు సోషల్ మీడియా స్టార్ గా ట్రెండ్ అవుతుంది.. అంత క్రేజ్ ను అందుకున్న ఈ ఆమ్మడు ఇప్పుడు వార్ 2 నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ సినిమాలో ఎవరికీ జోడిగా నటిస్తుందన్న విషయం పై క్లారిటీ రాలేదు..
ఈ సినిమా పై రోజు రోజుకు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.. ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించడం తో సినిమాకు ఇప్పటినుంచే డిమాండ్ పెరుగుతుందని తెలుస్తుంది.. ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌ల మధ్య ఓ సూపర్ డ్యాన్స్ నంబర్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. ఈ ఇద్దరు సూపర్ డ్యాన్స్ చేసే హీరోలే.. ఇద్దరు కలిసి పాట అంటే మాములుగా ఉండదని తెలుస్తుంది…ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్‌తో కలిసి నాటు నాటు అంటూ ప్రపంచం మొత్తాన్ని ఓ ఊపు ఊపేశారు.. ఈ పాటతో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడో చూడాలి..