రాళ్ళ దాడిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ తిరుపతిలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు రాళ్ళతో కొట్టాలని పిలుపునిచ్చారన్నారు. చంద్రబాబు నాయుడు వద్ద మంచి పేరు కోసం టిడిపి వారే శ్రీ వైఎస్ జగన్ పై రాళ్ళు విసిరారని ఆయన వ్యాఖ్యానించారు. ఒకే రాయి సీఎంకు తగిలి, పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్‌కి తగిలిందని, అయన కూడా కంటికి చికిత్స తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి ఎక్కడ సింపతీ పెరిగిపోతుందో అని టీడీపీకి ఆందోళన మొదలైందని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు తనమీద తానే రాళ్ళ విసిరించుకుని సింపతీ పొందాలని చూస్తున్నారని, గతంలో తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా రాళ్ళు వేసినట్టు డ్రామా ఆడారన్నారు మంత్రి పెద్దిరెడ్డి. అలిపిరి ఘటన తర్వాత సింపతీతో ఎన్నికలు గెలుద్దాం అని ముందస్తు కు వెళ్లి ఓడిపోయారని, సింపతీతో ప్రజలు ఓటు వేయరని చంద్రబాబు ఇకనైనా గ్రహించాలని ఆయన హితవు పలికారు. తండ్రి నీచంగా మాట్లాడుతుంటే, తనయుడు లోకేష్ మరింత నీచంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం, సింపతీ కోసం రాళ్ళు వేయించుకోవడం దురదృష్టకరమన్నారు మంత్రి పెద్దిరెడ్డి.