ఆదిలాబాద్ రూరల్ సర్కిల్ పరిధిలో నలుగురు అంతర్రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి మీడియా సమావేశం లో ఏర్పాటుచేసి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల లో తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్రతో అనుసంధానంగా ఉన్న లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద భారీ ఎత్తున గంజాయి పట్టుబడిన సందర్భంలో ఈ నిందితులు ఆ కేసులో మిగిలినవారుగా ఉండడం, అదేవిధంగా ఆ గంజాయి తరలించే…
మూసీ ప్రక్షాళన పై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సీఎం రేవంత్ రెడ్డి చేసిన అర్థరహిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మూసీపై అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారన్నారు. ఢిల్లీకి మూటలు పంపటం కోసమే ముఖ్యమంత్రికి మూసీపై ప్రేమ అని, నోట్ల రద్దు సమయంలో మోడీ మాటలు మార్చినట్లు.. మూసీపై రేవంత్ రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.…
తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులు, సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసి పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, డివిజన్ బెంచ్ ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు, కోర్టు అభ్యర్థులకు షాక్ ఇచ్చింది, ముఖ్యంగా ఈ నెల 21 నుంచి 27 వరకు జరగబోయే పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది. అంతేకాక, కోర్టు చివరి నిమిషంలో పరీక్షలను రద్దు చేయడం సాధ్యం కాదని, 8 మంది పిటిషనర్ల కోసం లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందుల్లో పడడం ఏమిటని…
ఏపీ వ్యాప్తంగా 90 శాతం మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం నాటికి 100 శాతం అన్ని మద్యం షాపులు తెరచుకోనున్నాయి. ఇప్పటి వరకు 7 లక్షల కేసులు లిక్కర్, బీరు కేసులు డిపోల నుంచి సరఫరా అయింది. మద్యం అమ్మకాల ద్వారా ఇప్పటి వరకు రూ. 530 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిసింది.
రెస్టారెంట్ల పరిస్థితి ఇప్పుడు పేరు గొప్ప.. ఊరు దిబ్బలా మారింది. బయటకి చూస్తే క్లాసీగా కనిపిస్తున్నా, వంటగది పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. భోజన ప్రియుల దృష్టిని దూరంగా ఉంచి, నాలుగు మొక్కలు, కొత్త పంథాలను ఉపయోగించి యాంబియెన్స్‌ను మెరుగుపరుస్తున్నారు. కస్టమర్లు హోటళ్ల వంటగదిని పరిశీలించరు కనుక, వారు ఏది అందించినా తింటారు అని భావిస్తున్నాయి రెస్టారెంట్ యాజమాన్యాలు. ముఖ్యంగా హైదరాబాద్‌లో, విభిన్న ప్రాంతాల ప్రజలు నివసిస్తున్నారు. వీకెండ్ వచ్చేసరికి, ఇంట్లో వండడం కన్నా రెస్టారెంట్ల…
బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు చేరుకొని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కుల గణనకు మద్దతు ఇవ్వాలని కిషన్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీల సమగ్ర కుల గణన, రిజర్వేషన్ల పెంపుకు సహకరించి, మద్దతు తెలపాలని కిషన్ రెడ్డిని కలవడం జరిగిందని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్…
చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని అబూజ్ మద్ తో పాటు దండకారణ్యం ప్రాంతాల్లో మావోయిస్టు వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఒకవైపు మావోయిస్టులపై భద్రతా బలగాలు విరుచుకుని పడుతున్నప్పటికీ మరోవైపున మావోయిస్టు పార్టీ తమ కార్యక్రమాల్ని కొనసాగిస్తూనే ఉంది తాజాగా దండకారణ్యంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున సమీకరణ అయ్యారు. పలు గ్రామాల గిరిజనుల ను ఒక చోటికి చేర్చి మావోయిస్టు వారోత్సవాలని నిర్వహించారు.. అమరులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పనిచేసిన రామకృష్ణ తో పాటు డప్పు రమేష్ ,నర్మద…
వైసీపీ చేయని తప్పులు లేవని.. లేకుంటే ఎందుకు ఎన్నికల్లో 11కు పడిపోయారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మనం నిలబడ్డాం నిలదొక్కుకున్నామని.. 93 శాతం సీట్లు వచ్చాయంటే... అందరం గుర్తు పెట్టుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం టీడీపీ ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు. విదేశాల నుంచీ వచ్చి మరీ మనల్ని గెలిపించారన్నారు.
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు పై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్, పేట్లబుర్జు హాస్పిటల్, వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో ఐవీఎఫ్ సెంటర్ల ఏర్పాటుకు 06/09/2018న జీవో 520 విడుదల చేశారని, కానీ, ఒక్క హాస్పిటల్లో కూడా ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకురాలేదని ఆయన మండిపడ్డారు. పేట్లబుర్జు, ఎంజీఎంలో పైసా పనిచేయలేదు. ఒక్క పరికరం కూడా కొనుగోలు చేయలేదని, 2023లో ఎన్నికలకు ముందు గాంధీకి కొన్ని ఎక్విప్మెంట్…