గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జీకి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా. కె.లక్ష్మణ్ తెలిపారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతకు ఇది నిదర్శనమన్నారు. రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమైన జీవో 29ను రద్దు చేయాలన్నారు. ఈ జీవో 29 తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ ప్రకారం కాకుండా 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్ క్లియర్ చేసిన అభ్యర్థులను మెయిన్స్ కు అర్హత కల్పించిందని ఆయన వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ ఏమాత్రం అమలు చేయలేదు. 563 పోస్టులకు అర్హత సాధించిన 31,382 మంది జనరల్ కోటా కిందే లెక్క అని, దీని వల్ల రిజర్వేషన్ అభ్యర్థులు నష్టపోతున్నారన్నారు.
ప్రపంచంలో కొన్ని రంగుల సరస్సులు ఉన్నాయి… ఎక్కడో తెలుసా..?
కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ వర్గాల ఉసురుపోసుకుంటోందని, వారికి రిజర్వేషన్ ప్రయోజనాలు అందకుండా చేస్తోందన్నారు ఎంపీ లక్ష్మణ్. గ్రూప్-1 నియామకాలపై వివాదాలు సృష్టించి… కోర్టు కేసులు సాకుగా చూపి… నియామకాలను వాయిదా వేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్లు కనిపిస్తోందని, జీవో 29పై ఆందోళన చెందుతున్న అభ్యర్థులతో ప్రభుత్వం చర్చలు జరపాలి… వారి ఆవేదన వినాలన్నారు. వారి డిమాండ్లను సానుకూల దృక్పథంతో పరిగణించాలని, లేకుంటే గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం జరిగేలా, వారి పక్షాన బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరిస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు.
Hyderabad: మియాపూర్‌లో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు