రెస్టారెంట్ల పరిస్థితి ఇప్పుడు పేరు గొప్ప.. ఊరు దిబ్బలా మారింది. బయటకి చూస్తే క్లాసీగా కనిపిస్తున్నా, వంటగది పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. భోజన ప్రియుల దృష్టిని దూరంగా ఉంచి, నాలుగు మొక్కలు, కొత్త పంథాలను ఉపయోగించి యాంబియెన్స్‌ను మెరుగుపరుస్తున్నారు. కస్టమర్లు హోటళ్ల వంటగదిని పరిశీలించరు కనుక, వారు ఏది అందించినా తింటారు అని భావిస్తున్నాయి రెస్టారెంట్ యాజమాన్యాలు. ముఖ్యంగా హైదరాబాద్‌లో, విభిన్న ప్రాంతాల ప్రజలు నివసిస్తున్నారు. వీకెండ్ వచ్చేసరికి, ఇంట్లో వండడం కన్నా రెస్టారెంట్ల నుంచి ఆహారం ఆర్డర్ చేయడం లేదా వెళ్లి తినడం అనేది సర్వసాధారణం అయింది. కానీ, ఈ క్రమంలో నాణ్యత లేని పదార్థాలు, నిల్వ చేసిన ఆహార పదార్థాలను కస్టమర్లకు అందిస్తూ కొన్ని హోటళ్లు పట్టుబడ్డాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఫుడ్ సేఫ్టే అధికారులు రెస్టారెంట్, హోటళ్లపై కొరడా ఝుళిస్తున్నారు. నాణ్యత లోపానికి తావివ్వకుండా.. ఏ చిన్న పొరపాటు చేసినా కేసులు నమోదు చేస్తూ.. అవసరమైతే తగు చర్యలు తీసుకుంటున్నారు.
Amazon: ఉద్యోగులకు అమెజాన్ వార్నింగ్.. ఇకపై ఆఫీస్‌కు రాకపోతే..!
ఆకస్మిక తనిఖీలు చేస్తూ హోటల్.. రెస్టారెంట్స్ యాజమాన్యాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. అయితే.. తాజాగా కొండా పూర్‌లోని శరత్ సిటీ మాల్‌లో ఉన్న ప్రముఖ రెస్టారెంట్ చట్నీస్‌లో ఈనెల 16న ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అధికారుల తనిఖీల్లో ముడిసరుకు నిల్వ చేసిన ప్రదేశంలో, సరుకుల్లో బొద్దింకలు దర్శనమిచ్చాయి. అంతేకాకుండా.. FSSAI లైసెన్స్ ఉండాల్సిన ప్రదేశంలో లేదని టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. పిండి, రవ్వ నిల్వల్లో నల్ల పరుగుల కనిపించాయని అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. ముడి సరుకులతో పాటు శానిటరీ ద్రవాలు ఒకే చోట నిల్వ చేయబడ్డాయని, వాష్ ఏరియా మొత్తం దుర్వాసనతో చాలా దుర్గంధంగా ఉందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. నిల్వ ఉంచిన ఉల్లిపాయలు, క్యాబేజీతో పాటు పలు కూరగాయలు కూడా చెడిపోయి మానవ వినియోగానికి పనికిరాని విధంగా ఉన్నాయని తెలిపారు. ఫుడ్ హ్యాండ్లర్లకు ఆహార భద్రత శిక్షణ, ధృవీకరణ (FoSTaC) లేదని, సరుకులు కోసేందుకు ఇనుప కత్తులు వాడుతున్నట్లు గుర్తించామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చట్నీస్ రెస్టారెంట్ కు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
Asaduddin Owaisi : ఎన్‌కౌంటర్ చేసిన వారిని ఒలింపిక్స్‌కు పంపండి.. సీఎం యోగిపై ఒవైసీ ఫైర్
Task force team has conducted inspections in Sarath City Mall, Kondapur on 16.10.2024.
𝗖𝗵𝘂𝘁𝗻𝗲𝘆𝘀, 𝗦𝗮𝗿𝗮𝘁𝗵 𝗖𝗶𝘁𝘆 𝗠𝗮𝗹𝗹, 𝗞𝗼𝗻𝗱𝗮𝗽𝘂𝗿
* FSSAI licence was not displayed at a prominent place.
* Cockroaches were found in the raw material storage area.
* Atta… pic.twitter.com/ErxRNgg3BA
— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) October 18, 2024