Ganja : ఈజీ మనీ ముసుగులో గంజాయి అమ్ముతు పట్టుబడిన ఇద్దరు నిందితులు
- రూ. 25 వేల విలువైన గంజాయి స్వాధీనం
- రూ.20 లక్షల విలువైన వాహనాలు సీజ్
- ఈజీ మనీ ముసుగులో గంజాయి సరఫరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చదువుకుంది ఇంజనీరింగ్. చేస్తున్న వృత్తి మోడల్ ఫోటోగ్రఫీ. తిరిగేది ఖరీదైన కార్లు, బైకుల్లో, వాడుతున్న సెల్ ఫోన్లు చూస్తే రూ. లక్షల ఐ ఫోన్లు . ఖరీదైన అద్దె నివాసముంటు, సమాజంలో బడా బాబుల్లా వ్యహారం. కాని మూడోకంటికి తెలియకుండా గుర్తు చప్పుడు కాకుండా గంజాయి వ్యాపారం చేస్తూ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ పోలీసులకు పట్టుబ డి ఉన్న పరువు కాస్తా.. బజార్‌లో పడేసి.. కటకటాల పాలైన యువకుల చీకటి బాగోతం. వివరాల్లోకి వెళితే.. కూకట్‌పల్లి వసంతనగర్ హౌజ్ నెంబ రు 741, రోడ్ నెంబ రు 21లో ఖరీదైన అద్దె భవనంలో ఇద్దరు ఇంజనీరింగ్ యువకులు గంజాయి అమ్మకాలు చేపడుతున్నారనే సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం ఎస్ టి ఎఫ్ సీఐ నాగరాజు, ఎస్సై జ్యోతితోపాటు సిబ్బంది కలిసి ఇంట్లో సోదాలు నిర్వహించారు.
Hyderabad: మియాపూర్‌లో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు
Also Read
- Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఖరీదైన అద్దె భవనంలో ఖమ్మంకు చెందిన బేగం నిలేష్ కుమార్, వరంగల్ డొర్నకల్‌కు చెందిన సిరాజుల్లా నివాసముంటున్నారు. ఇంట్లో సోదాలు నిర్వహించినపుడు 1.185 కిలోల గంజాయి లభించింది. ఇద్దరు నిందితులను విచారించగా గత కొంత కాలంగా ఇన్‌స్ట్రా గ్రామ్‌లో కాకినాడ నుంచి గంజాయిని తెప్పిస్తూ అమ్మకాలు సాగిస్తున్నారని వెల్లడించారని సిఐ తెలిపారు. గంజాయిని కారులోను, బైకులోను తీసుకవచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు. వీరివద్ద నుంచి రూ. 15 లక్షల కారు, రూ. మూడు లక్షల విలువ చేసే బైక్, రూ. 3 లక్షల విలువ మూడు ఐ ఫో న్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.25 వేలు. పట్టుబడిన వాహనాల ఖరీదు మాత్రం రూపాయలు 20 లక్షల పైనే ఉంటుందని అంచనా వేశారు. ఇద్దరు ఖమ్మంలోని ఇంజనీరింగ్ సమయములో స్నేహితులు. స్నేహితులుగా హైదారాబాద్ వచ్చి నివాసముంటున్నారు. నిలేష్ కుమార్ మోడల్ ఫోటోగ్రఫీ చేస్తు మరో పక్క గంజాయి అమ్మకాలు చేపడుతూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబ డ్డారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌లో కానిస్టేబుళ్లు రాజేష్, వికాష్, జయచంద్ర, కాశీలు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌ను అడిషనల్ ఎస్పీ భాస్కర్ అభినందించారు.
Ukraine War: ఉక్రెయిన్ యుద్ధంలోకి “కిమ్” ఆర్మీని దింపిన పుతిన్..
తాజావార్తలు
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు