మూసీ ప్రక్షాళన పై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సీఎం రేవంత్ రెడ్డి చేసిన అర్థరహిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మూసీపై అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారన్నారు. ఢిల్లీకి మూటలు పంపటం కోసమే ముఖ్యమంత్రికి మూసీపై ప్రేమ అని, నోట్ల రద్దు సమయంలో మోడీ మాటలు మార్చినట్లు.. మూసీపై రేవంత్ రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మూసీ సుందరీకరణ అనే పదం మాట్లాడిందే మొదట రేవంత్ రెడ్డి అని, లక్షన్నర కోట్లు ఖచ్చు చేస్తామని చెప్పింది కూడా రేవంత్ రెడ్డినే అని కేటీఆర్ అన్నారు. మూసీపై ప్రభుత్వం అస్సలు సర్వేనే చేయలేదని, తన చేసిన పాపం బయటకి రావటంతో ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పడ్తున్నాయన్నారు. గ్రాఫిక్స్ మాయాజాలంతో రేవంత్ అబద్దాలు చెప్పారని కేటీఆర్ మండిపడ్డారు.
Samsung Galaxy A16 5G: శాంసంగ్ నుంచి బడ్జెట్ ఫోన్ లాంచ్.. అదిరిపోయిన ఫీచర్లు
జాతీయ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ.. ఏటీఎంలా మారిందని, మూసీ సుందరీకరణ చేయాలంటే, లక్ష మంది నిరాశ్రయులవుతారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మూసీని సుందరీకరణ చేయాలనుకున్నామని, లక్షల మంది పొట్ట కొట్టదని కేసీఆర్ సూచించారన్నారు. మహాత్మాగాంధీ బస్ స్టేషన్, మెట్రో స్టేషన్ కూడా రివర్ బెడ్ లోనే ఉన్నాయని, బఫర్ జోన్ లో ఉన్న ప్రతి ఇంటికి ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చిందన్నారు. ఒక్క పేదవాడి కడుపు కూడా కొట్టకుండా.. నాగోల్, ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో మూసీని సుందరీకరించామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ వలనే హైదరాబాద్ రోడ్లపై నీరు నిలవటం లేదని ఈటల రాజేందర్ కూడా అన్నారని, కాళేశ్వరం నీళ్ళను గండిపేటకు జోడించటానికి ప్లాన్ చేశామన్నారు కేటీఆర్. అంతేకాకుండా.. మూసీని మురికి కూపంగా మార్చిన పాపం.. కాంగ్రెస్ టీడీపీలదే అని ఆయన ధ్వజమెత్తారు. మూసీకి పురిట్లోనే రేవంత్ రెడ్డి ఉరేసే ప్రయత్నం చేస్తున్నారని, మానవీయ కోణంలో మూసీని శుద్ది చేయాలనుకున్నామన్నారు. పేదల ఇళ్ళు కొట్టాలని మేము అనుకోలే అని, ముఖ్యమంత్రి మాదిరి కాకుండా.. నల్లగొండ మంత్రులు విషయం తెలసుకుని మాట్లాడాలన్నారు కేటీఆర్.
Meta Platform: కంపెనీ తినడానికి డబ్బులిస్తే.. వైన్ గ్లాసులు కొన్నారు.. కట్ చేస్తే జాబ్ గోవింద?