Satish Kumar Reddy: చెల్లి కోసం జగన్ సొంత ఆస్తుల్లో కూడా వాటా ఇచ్చారు..
- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ప్రెస్‌మీట్
- జగన్ ఆస్తి వివాదంపై కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satish Kumar Reddy: వైయస్ రాజశేఖరరెడ్డి బ్రతికుండగానే జగన్, షర్మిలకు సమానంగా ఆస్తి పంపకాలు చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి తెలిపారు. జగన్‌కు బెంగుళూరులో ఇల్లు ఉందని షర్మిలకు హైదరాబాద్ లోటస్ పాండ్ ఇల్లు ఇచ్చారని వెల్లడించారు. వివాహం అయినా తర్వాత షర్మిల వాటాలు తీసుకొని మళ్ళీ ఆస్తులు కోరడం సమంజసం కాదన్నారు. జగన్ సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి చెందాడన్నారు. వైయస్ సీఎంగా ఉన్నప్పుడు తండ్రిగా దూరంగా ఉంటు బెంగుళూరులో వ్యాపారం చేసుకున్నారని చెప్పారు. రఘురాం సిమెంట్ కొని భారతి సిమెంట్స్ ఏర్పాటు చేసుకున్నారన్నారు.
Read Also: Drinker Hulchul: తాగుబోతు హల్‌చల్.. పీకలదాకా తాగి బస్సుపై నిద్రించిన మందుబాబు
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
షర్మిల ఆస్తుల్లో జగన్ వాటా అడగలేదన్నారు. చెల్లి కోసం జగన్ సొంత ఆస్తుల్లో కూడా వాటా ఇచ్చారన్నారు. జగన్ వ్యాపారాల్లో షర్మిల ఎక్కడైనా డైరెక్టర్‌గా ఉన్నారా అంటూ ప్రశ్నించారు. చెల్లెలు మీద ప్రేమతో సొంత ఆస్తులు ఇచ్చారన్నారు. వైయస్ మరణం తర్వాత ప్రేమతో షర్మిలకు ఆస్తులు ఇచ్చారని తెలిపారు. కోర్టు కేసులు తెగిన తర్వాత కొన్ని ఆస్తులు ఇస్తానని చెప్పారన్నారు. జగన్ ఎదుగుదల చూసి ఓర్వలేక అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు.చంద్రబాబు, చంద్రబాబు కుటుంబ సభ్యులు అవినీతి చేయలేదని గుండెమీద చెయ్యి వేసి చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు 50రోజులు జైల్లో ఉంటే ఏదో జరిగినట్లు టీడీపీ నేతలు మాట్లాడారన్నారు. చంద్రబాబు ఇంట్లో తల్లిదండ్రులు, చెల్లి అక్కలు ఎప్పుడైనా ఉన్నారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారని.. ఆయన అక్కా చెల్లెళ్ళకు ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు. కానీ వాళ్ళు రోడ్డెక్కలేదన్నారు. ఒకసారి వాళ్ళ ను చూసి నేర్చుకోవాలన్నారు. చేతకాని వ్యాపారం, రాజకీయం చేసి జగన్ మీద పడడం సమంజసమా అంటూ సతీష్ కుమార్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!