* అమరావతి: ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు.. డీజీపీ ద్వారకాతిరుమల రావు కుమార్తె వివాహానికి హాజరవుతున్న ఏపీ సీఎం
హైదరాబాద్: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో భేటీ.. పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం.
* నారాయణపేట జిల్లా: నేడు మద్దూరు మండలానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇటీవల మరణించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివరాజ్ కుమారుడు సతీష్ కుటుంబాన్ని పరామర్శించనున్న సీఎం.. బొంరాస్పెట్ మండలం రేగడిమైలారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సి రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్న రేవంత్‌రెడ్డి..
* నేడు సంగారెడ్డిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పర్యటన.. రాష్ట్ర మహాసభల సన్నాహక సమావేశంలో పాల్గొననున్న తమ్మినేని.. జనవరి 2025లో సంగారెడ్డిలో జరగనున్న సీపీఎం 4వ రాష్ట్ర మహాసభలు
* హైదరాబాద్: నేడు ముషీరాబాద్ నియోజకవర్గంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న మంత్రి..
* ప్రకాశం : రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కార్యక్రమాలు.. సింగరాయకొండ లో కల్యాణ మండపం శంకుస్థాపన.. కొండపిలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే రక్తదాన శిబిరంలో పాల్గొంటారు. మర్రిపూడిలో రైతులకు స్పిoకర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
* బాపట్ల : సంతమాగులూరు మండలం పుట్టావారి పాలెం టిడిపి కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొననున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర పురపాలక.. పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ… రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి లు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* తూర్పుగోదావరి జిల్లా: మంత్రి కందుల దుర్గేష్ నేటి కార్యక్రమాలు.. రాజమహేంద్రవరం, సరస్వతి ఘాట్ నందు టూరిజం క్యాంప్ ఆఫీస్ వద్ద “టూరిజం బస్ ప్రారంభోత్సవ” కార్యక్రమంలో పాల్గొంటారు. NDA కూటమి పార్టీ నాయకులతో మీటింగ్ లో పాల్గొంటారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ నందు “ఇన్చార్జి మినిస్టర్ మీటింగ్” కార్యక్రమంలో పాల్గొంటారు. రాజమహేంద్రవరం, తాడితోట లో శ్రీ మహాత్మా గాంధీ హోల్సేల్ క్లాత్ కాంప్లెక్స్ కమిటీ హాల్ నందు “ది రాజమండ్రి హోల్సేల్ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ 60 వసంతాల మహోత్సవ” కార్యక్రమంలో పాల్గొంటారు.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు NDA కూటమి పార్టీ నాయకుల సమావేశం.. రాజమండ్రి మోరంపూడి జంక్షన్ శుభమస్తు ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న సమావేశం.. హాజరుకానున్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు
* తిరుమల: 5 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 56,501 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,203 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు
* ఏలూరు: గుటూరు మండలం నారాయణపురంలో త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డి పర్యటన.. పలు కార్యక్రమాల అనంతరం ఆక్వా రైతులతో సమేశంలో పాల్గొంటారు..
* కర్నూలు: నేడు మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి టీజీ భరత్ సమీక్ష
* కర్నూలు: సుంకేసుల జలాశయంకు కొనసాగుతున్న వరద .. ఇన్ ఫ్లో 37,750 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 36,661 క్యూసెక్కులు.. 8 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
* విజయవాడ పర్యటనలో మంత్రులు పయ్యావుల కేశవ్ , సత్యకుమార్ , సవిత.
* కర్నూలు: మంత్రాలయంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నేడు స్వామి వారికి తులసిఅర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతభిషేకం, మహా మంగళహారతి వంటి విషేశ పూజలు.. సాయంత్రం ప్రతిమను రథంపై ఉరేగింపు.
* చెన్నై: తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు.. ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. మదురైలో కుండపోత వర్షం.. నీట మునిగిన పలు ప్రాంతాలు.. మదురైలో విద్యుత్ సరఫరా నిలిపివేత
* శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు.. 2 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేత.. ఇన్ ఫ్లో 1,17,326 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 1,22,874 క్యూసెక్కులు.. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
* తూ.గో.: నేటి నుంచి పాపికొండల విహారయాత్రలు.. 4 నెలల విరామం తర్వాత విహారయాత్రకు టూరిజం గ్రీన్‌సిగ్నల్.. దేవీపట్నం మండలం పోచమ్మ గండి నుంచి బయల్దేరనున్న బోట్లు.. పర్యాటకుల సందడి
* నేటి నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం