తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కేంద్ర బడ్జెట్‌పై తీర్మానం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి జరగాలని ఏపీ విభజన చట్టంలో పొందుపర్చారన్నారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టం చేశారని, గడిచిన పదేళ్లు ఆ చట్టాలను అమలు చేయలేదన్నారు. గత ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయలేదని, మేం అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఢిల్లీ వెళ్లామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు వాగ్వాదాల నడుమ నడిచింది. కేంద్రాని ప్రశ్నించేందుకు ఎందుకు కలిసి రారు అని బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ టార్గెట్ చేయగా.. కేసీఆర్‌పై కోపంతో రాష్ట్రానికి అన్యాయం చేయవద్దంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు వాదనలు చేశారు. అయితే.. చివరగా.. కేంద్రం బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్రం అన్యాయం జరిగిందనే అభిప్రాయానికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ అంటే మొదటి నుంచి ప్రధాని మోడీకి చిన్నచూపు అని…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతు్న్నాయి. బీఆర్‌ఎస్- కాంగ్రెస్ ల మధ్య చర్చలు హీటును పుట్టించాయి. అయితే.. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించామని మేము ఎప్పుడూ చెప్పలేదని, మేము ఎవరి శవాలపై రాజకీయాలు చేయలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను ఢిల్లీకి రమ్మని చెప్పండని, నేను కూడా దీక్షలో కూర్చుంటానని ఆయన సవాల్ విసిరారు. ఇద్దరం సచ్చుడో, నిధులు తెచ్చుడో చూద్దామని సీఎం రేవంత్ ఉద్ఘాటించారు. రూ.వంద పెట్టి పెట్రోల్…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. అయితే ఈ సందర్భంగా అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. నేను మాట్లాడటానికి మూడు సార్లు లేచానని, కాంగ్రెస్ – బీ ఆర్ ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. అందుకే నన్ను మాట్లాడనివ్వకుండ విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారన్నారు. గత బడ్జెట్ లో నాలుగు వేల కోట్ల రూపాయలు ఒకే నియోజక వర్గానికి మీరు ఇచ్చినప్పుడు అది మిగతా జిల్లాలను విస్మరించడమేనా? అని ఆయన ప్రశ్నించారు.…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ జరిగిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. తెలంగాణ ఏ రైతు అప్పుల పాలు కావద్దని భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ వరంగల్ డెకరేషన్ లో చెప్పిండన్నారు. మంత్రివర్గమంతా దృఢ సంకల్పం నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మాటను శిలాశాసనంగా భావించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, ఈ…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే.. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య ఆర్టీసీపై చర్చ జరిగింది. దీనిపై వాకౌట్ చేసిన బీఆర్‌ఎస్ నేతలు.. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్దకు వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోయిందని, రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని గమనిస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి ఆయన…
చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైల్లో 200 పైగా ఉన్న కుక్కల బెడద అటు జైలు అధికారులను ఇటు ఖైదీలను కలవర పెడుతున్నాయి.గత కొన్ని ఏళ్లుగా చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైల్లో ఖైదీలు తిని పడేసిన ఆహారం పదార్థాలు నాన్ వెజ్ వ్యర్ధాలు జైలు పరిసర ప్రాంతాల్లో పడవేయడం వల్ల ఒకటి ఒకటి అయి ఇప్పుడు 200 కుక్కల వరకు పెరిగిపోవడంతో జైల్లో కుక్కలతో భయాందోళనకు గురి అవుతున్నారు. గతంలో జీవిత ఖైదీలపై జైలు అధికారులపై…
ప్రమాద బీమా కవరేజీని రూ.కోటికి అందించేందుకు కృషి చేస్తున్నామని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్ తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు 30 లక్షలు. మంగళవారం కాంట్రాక్టు కార్మికుల సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన బలరాం మాట్లాడుతూ.. ప్రమాద బీమా కవరేజీ పథకాన్ని ఇప్పటికే SBI , యూనియన్ బ్యాంకుల ద్వారా సింగరేణి ఉద్యోగులకు రూ.1 కోటి, కాంట్రాక్ట్ కార్మికుల ప్రయోజనం కోసం త్వరలో ఇదే విధమైన పథకం అమలు చేయబడుతుందని…
మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామ సమీపంలో నిన్న రాత్రి మసీదును కూలగొట్టారని నెపంతో పెద్ద మొత్తంలో హైదరాబాదు నుంచి ముస్లింలు అక్కడికి చేరుకొని ప్రార్థనలు నిర్వహించి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అక్కడ మళ్లీ మసీదును నిర్మించాలని చెప్పడంతో అధికారులు ఇది మత కల్లోలం జరుగుతుందనే నేపంతో దానిని పునర్ నిర్మించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ చిలుకూరు ప్రజలు మాత్రం ససేమిరా ఒప్పుకోవడం లేదు. అది మసీదు కాదు గుర్రాల శాల మాత్రమేనని…