ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ జరిగిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. తెలంగాణ ఏ రైతు అప్పుల పాలు కావద్దని భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ వరంగల్ డెకరేషన్ లో చెప్పిండన్నారు. మంత్రివర్గమంతా దృఢ సంకల్పం నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మాటను శిలాశాసనంగా భావించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు జరిపి.. లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులు ఉండాలని అందరికీ అసెంబ్లీ ప్రసాదాలు పంపిణీ చేశామన్నారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష నాయకులకు ప్రసాదం పంపిణీ చేశామని, ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు బీర్ల ఐలయ్య.
YS Jagan: జంతర్ మంతర్ దగ్గర వైఎస్ జగన్ ధర్నా.. సంఘీభావం ప్రకటించిన అఖిలేష్ యాదవ్..!