తెలంగాణ అసెంబ్లీ మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్.. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్‌బాబు.. ఇవాళ ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. తెలంగాణ బడ్జెట్ 2024-25కు ఆమోదం తెలపనున్న కేబినెట్.
నేడు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం.. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే అసెంబ్లీ నుంచి నేరుగా కాళేశ్వరం బయల్దేరనున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. మొదటగా నేడు సాయంత్రం కరీంనగర్ LMD రిజర్వాయర్ సందర్శన.. రాత్రి రామగుండంలో బస.. రేపు 10 గంటలకు కన్నెపల్లి పంపు హౌజ్ సందర్శన.. 11 గంటలకు మేడిగడ్డ సందర్శన.
అమరావతి: శాసనమండలిలో నేడు.. గత 5 ఏళ్ల పాలనలో అదుపుతప్పిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనున్న హోం మంత్రి వంగలపూడి అనిత
అమరావతి: అసెంబ్లీలో నేడు గత 5ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇటీవల చనిపోయిన మాజీ శాసనసభ్యులు పెండ్యాల వెంకట కృష్ణారావు, యెర్నేని సీతాదేవి, అనిశెట్టి బుల్లబ్బాయ్ రెడ్డి, సద్దపల్లి వెంకటరెడ్డిలకు సంతాపం ప్రకటించనున్న శాసనసభ
అమరావతి: మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ.. పోలవరం విషయంలో కీలక చర్చ.. పోలవరం ప్రాజెక్టు తాజా అంచనాలు, డయాఫ్రం వాల్ స్థితిగతులపై కేబినెట్‌లో కీలక సమీక్ష.
అన్నమయ్య: నేడు మదనపల్లెలో భూ బాధితుల అర్జీల స్వీకరణ.. మదనపల్లె పరిసరాలలో భూ కబ్జాలపై ఆరోపణలు.. బాధితుల నుంచి అర్జీలు స్వీకరించనున్న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా.. 2022 నుంచి ఉన్న భూ వివాదాల పరిష్కరానికి ప్రభుత్వం శ్రీకారం.. సాయంత్రం 4గంటల నుంచి అందుబాటులో ఉండనున్న సిసోడియా.
విశాఖ: నేటి నుంచి రైతు బజార్లలో తగ్గింపు ధరకు టమాటాలు విక్రయం ప్రారంభం.. కేజీ 48 రూపాయలకు అమ్మేందుకు మార్కెటింగ్ శాఖ సిద్ధం.. చిత్తూరు జిల్లా నుంచి భారీగా టమాటాలు దిగుమతి.
అన్నమయ్య: మదనపల్లెలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పర్యటన.. సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించనున్న సీఎస్.. సీఎస్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అర్డీవోలు,ఎం ఆర్ వోలకు మదనపల్లెకి రావాలంటూ పిలుపు.. జిల్లాలో 22ఏ,చిక్కుల భూములు, ఇనాం స్థలాల వివరాలను సీఎస్‌కు ఇవ్వనున్న అధికారులు.. ఫూర్తి సమాచారంతో రావాలని ఆదేశాలు.
తిరుమల: 17 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,023 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 26,942 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.98 కోట్లు.
అల్లూరి: నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు.. వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు..
తూర్పుగోదావరి: గోదావరికి తగ్గుతున్న వరద ఉధృతి.. భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే ఛాన్స్.. భద్రాచలంలో 44 అడుగుల వరద ప్రవాహం.. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ.. ధవళేశ్వరం దగ్గర 14 అడుగుల వరద ప్రవాహం.. 13.75 అడుగలకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకునే ఛాన్స్.