Bandi Sanjay : కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా?
- రాష్ట్ర బడ్జెట్ పై బండి సంజయ్ కుమార్ సెటైర్
- 6 గ్యారంటీలు + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? అని వ్యాఖ్య
- గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో... కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం అంతే నిజమనేని విమర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర బడ్జెట్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ.. కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. 6 గ్యారంటీలు + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? అని, గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో… కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం అంతే నిజమనే దానికి బడ్జెట్ నిదర్శనమిని ఆయన విమర్శలు గుప్పించారు. భట్టి విక్రమార్క గారు… మీరు చదివింది ఆర్థిక బడ్జెట్టా లేక అప్పుల పత్రమా..? అని ఆయన ప్రశ్నించారు. అప్పులున్నందున హామీలను అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నారా? అప్పులున్న విషయం ముందు మీకు తెలిసి కూడా 6 గ్యారంటీలిచ్చిన మీరు వాటన్నింటికీ బడ్జెట్ లో నిధులెందుకు కేటాయించలేదు? 6 గ్యారంటీలుసహా హామీల అమలుపై చర్చ జరగకుండా ఉండేందుకే కేంద్రాన్ని బదనాం చేయాలనుకుంటున్నారా? అని బండి సంజయ్ అన్నారు. బడ్జెట్ కేటాయింపులకు సరిపడ ఆదాయం ఎక్కడి నుండి సమకూర్చుకుంటారో బడ్జెట్ లో లెక్కా పత్రం చూపకపోవడం విడ్డూరమని, సర్కారీ భూములన్నీ అడ్డికి పావుశేరు అమ్మాలనుకుంటున్నారా? అని ఆయన వ్యాఖ్యానించారు.
Olympics 2024: ఆరు పదుల వయసులో ఒలింపిక్స్ లోకి అడుగు పెడుతున్న బామ్మ..
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
అంతేకాకుండా..’ ఔను… హామీలను అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ కు మాటలెక్కువని బడ్జెట్ చూస్తే అర్ధమవుతోంది. 12 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చిన మీరు 31 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమే. రూ.లక్షన్నర కోట్లతో నిర్మిస్తామన్న మూసీ రివర్ ఫ్రంట్ కు బడ్జెట్ లో పైసా కేటాయించని మీరా కేంద్రంపై విమర్శలు చేసేది? రంజాన్ వేడుకలకు రూ.33 కోట్లు కేటాయించిన ప్రభుత్వం హిందువుల పండుగలకు నయాపైసా కేటాయించకపోవడం మతతత్వం కాదా? ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ హిందూ ప్రజలకు తీవ్రమైన నష్టం చేయడమేనా మైనారిటీ డిక్లరేషన్ అంటే? రుణమాఫీవల్ల రైతులకు లాభం కంటే నష్టమే జరిగిందని ప్రభుత్వమే ఒప్పుకుంది. రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చి డిఫాల్టర్ల జాబితా నుండి తొలగిస్తారా? లేదా? చెప్పాలి. ఏడాదిపాటు నష్టపోయిన ‘రైతు భరోసా’, రూ.500 బోనస్, పంట నష్ట పరిహారం నిధులను కూడా ఈ ఏడాది చెల్లిస్తారా? లేదా? జాతీయ వ్రుద్ధి రేటు కంటే తెలంగాణ వ్రుద్ధి రేటు తక్కువ నమోదు కావడమే 10 ఏళ్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనకు అద్ధం పడుతుంది. కేబినెట్ మంత్రుల మధ్యే సఖ్యత లేదు… తెలంగాణలో సమసమాజం స్థాపిస్తామనడం శతాబ్దం జోక్. ఇప్పటికైనా పీఎం ఫసల్ బీమాలో చేరాలని నిర్ణయించడం సంతోషం.
INDIA Bloc: కేజ్రీవాల్ కోసం రంగంలోకి ఇండియా కూటమి.. ఢిల్లీలో భారీ నిరసనకు ప్లాన్!
90 లక్షల తెల్ల రేషన్ కార్డులుంటే… 39 లక్షల మందికే గ్యాస్ సబ్సిడీ ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం దారుణం. 50 లక్షల మంది అర్హులకు రూ.500 సబ్సిడీని ఎగ్గొట్టి మహిళల్లో వెలుగులు నింపామని చెప్పుకోవడం సిగ్గు చేటు. ఇందిరమ్మ ఇండ్లు, ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో కేంద్ర నిధులున్నాయని బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం విడ్డూరం. బడ్జెట్ లోని చివరి పేజీలో ప్రస్తావించిన మహాత్ముడి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి, అప్పులకు…. మీరిచ్చిన అలవి కాని హామీలకు మధ్య ఉన్న అంతరాన్ని గ్రహించండి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను రాబోయే ఐదేళ్లలో కూడా అమలు చేయడం అసాధ్యమని బడ్జెట్ లోనే తేలింది. బడ్జెట్ లో ఏ ఒక్క నియోజకవర్గం ఊసే లేదు… సీఎంసహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారా?. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ పేరు రాలేదని… రాష్ట్రానికి కేటాయింపులే లేవన్నట్లు ప్రజలను రెచ్చగొట్ట్టిన కాంగ్రెస్ నేతలు రాష్ట్ర బడ్జెట్ లో ఏ ఒక్క జిల్లా, నియోజకవర్గం ప్రస్తావన చేయలేదు కదా… దీనికేం సమాధానం చెబుతారు?. బడ్జెట్ లో పేరు ప్రస్తావించకపోయినంత మాత్రాన ఆ ప్రాంతాలకు అన్యాయం చేసినట్లా? రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తారా?’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
London: ఎయిర్‌పోర్టులో అమానుషం.. ప్రయాణికులపై పోలీసుల దౌర్జన్యకాండ
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!