తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. అయితే ఈ సందర్భంగా అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. నేను మాట్లాడటానికి మూడు సార్లు లేచానని, కాంగ్రెస్ – బీ ఆర్ ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. అందుకే నన్ను మాట్లాడనివ్వకుండ విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారన్నారు. గత బడ్జెట్ లో నాలుగు వేల కోట్ల రూపాయలు ఒకే నియోజక వర్గానికి మీరు ఇచ్చినప్పుడు అది మిగతా జిల్లాలను విస్మరించడమేనా? అని ఆయన ప్రశ్నించారు. మా ఎమ్మెల్యే , ఎంపీ లపై విష ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మేము 8 మంది ఎంపీ లుగా గెలిచామని, సీఎం సీటుకు ఎక్కడ ఎసరు వస్తాదోనని రేవంత్ భయపడుతున్నారన్నారు మహేశ్వర్ రెడ్డి.
CID investigation on Liquor Scam: మద్యం కుంభకోణంపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..
సీఎం అనుభవం లేకుండా మాట్లాడుతున్నారని, మిత్రమా రామచంద్ర నాయక్ మీరు ఎంత తిప్పలు పడ్డా పదవి ఇవ్వరని ఆయన విమర్శించారు. మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడిన మీ మాటలు విన్నామని, మేము రెండు నిమిషాలు మాట్లాడితే ఉలుకెందుకు? అని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వమని సీఎం రేవంత్ , మాజీ సీఎం కేసీఆర్ సీఎం చెప్పారని, గత పదేళ్ళలో రాష్ట్రానికి 9 లక్షల 50 వేల కోట్లు ఇచ్చామన్నారు మహేశ్వర్ రెడ్డి. 80 వేల కోట్ల పనులు కేంద్ర సహకారంతో నడుస్తున్నాయన్నారు మహేశ్వర్ రెడ్డి.
Duddilla Sridhar Babbu : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత ప్రమాదకరంగా ఉంది