తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో తాత్కాలిక పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని హెచ్చరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అత్యవసర పరిస్థితుల్లో ఏ సమయంలోనైనా తనను సంప్రదించాలని అధికారులను కోరారు. రాబోయే మూడు రోజులలో 30-40 కి.మీ/గం గాలులతో పాటు వర్షం కురిసే అవకాశం ఉంది. జూలై 22, సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్‌లతో నిర్వహించిన…
రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించకుండా పంట రుణమాఫీని అమలు చేయాలని, అలాగే గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు . అసెంబ్లీకి బయలుదేరే ముందు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , సీనియర్ నేతలు హరీష్‌రావు , జగదీష్ రెడ్డి తదితరులతో సహా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గన్‌పార్క్ వద్ద సమావేశమై తెలంగాణ అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి…
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ ముగియనుంది. ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యతలను గవర్నర్ వివరించనున్నారు.
బెంగళూరులోని స్విగ్గీ మరియు జొమాటో డెలివరీ ఏజెంట్లతో యూట్యూబర్ చేసిన ఇంటర్వ్యూ సంచలనం సృష్టించింది. అందులో వారి ఆదాయాల గురించి ఆసక్తికరమైన సమాచారం తెలిసింది.
బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా బాధ్యులైన అధికారుల్ని ఉపేక్షించబోనని బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత హెచ్చరించారు. వర్షాలు పడుతుండడం, వ్యాధులు వ్యాపించే అవకాశం ఉండడంతో తక్షణమే హాస్టళ్లలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు.
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ఘాట్ 18వ మలుపు వద్ద వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి.
ఏపీ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ను హీరో సుమన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల తరువాత అందరూ బిజీగా ఉన్నారని ఇప్పటి వరకూ ఎవ్వరిని కలవలేదని.. రేపు ఓ కార్యక్రమం ఉందని, అందుకే ఒక రోజు ముందు వచ్చి అందర్ని మర్యాదపూర్వకంగా కలుస్తున్నామన్నారు.