గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను తీసుకవచ్చిన విషయం తెలిసిందే. అయితే చట్టాలు ఆమోదయోగ్యంగా లేవంటూ ఇటు ప్రతిపక్షాలు, అటు రైతులు దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా దేశ రాజధాని ఢిల్లీలో సంవత్సరం పాటు రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకొని 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నేడు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ వ్యవసాయ చట్టాల…
ఏపీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం మూడు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా ఏపీ సీఎంతో సమావేశం నిర్వహించింది. అనంతరం కేంద్రం బృందం సభ్యుడు కునాల్ సత్యార్థి మాట్లాడుతూ.. కేంద్ర బృందం తరుపున వివరాలను సీఎం జగన్‌కు సమర్పించినట్లు తెలిపారు. అంతేకాకుండా వరద ప్రభావం వల్ల కడప జిల్లాలో భారీ నష్టం జరిగిందన్నారు. పంటలు, పశువులు కొట్టుకుపోయాయని, అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిన చోట అపార నష్టం…
ఏపీ రాజకీయాను ఒక్కసారిగా భగ్గుమనిపించిన అసెంబ్లీ ఘటనపై స్పీకర్ తమ్మనేని సీతారాం స్పందించారు. ఘటనపై ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో జరిగిన దానికి నేను ప్రత్యక్ష సాక్షినని అన్నారు. ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలుసునని ఆయన వెల్లడించారు. పత్రిపక్షాల ఆరోపణల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా సభలో రికార్డులను కూడా పరిశీలించామని ఆయన తెలిపారు. సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపైన ఉందని ఆయన హితవు పలికారు. సభను పక్కదారి పట్టించేందుకు తన…
కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఏపీ, తెలంగాణలోని పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో ఆలయాల్లో మహిళలు దీపాలు వెలిగిస్తున్నారు. అయితే గుంటూరు జిల్లా తెనాలిలో కార్తీక దీపారాధనలో అపశ్రుతి చోటు చేసుకుంది. తెనాలి మండలం చినరావూరులోని పోతురాజు స్వామి ఆలయంలో దీపాలు వెలిగిస్తుండగా… వైకుంఠపురానికి చెందిన గుడివాడ సుహాసిని అనే మహిళ చీరకు ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పివేసినా అప్పటికే ఆమె శరీరం సగానికి పైగా కాలిపోయింది.…
కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు న్యూజిలాండ్ ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ టెస్టులో న్యూజిలాండ్ ముందు 284 పరుగుల టార్గెట్‌ను భారత్ విధించింది. లక్ష్యఛేదనలో నాలుగోరోజే ఓ వికెట్ కోల్పోయిన కివీస్‌ను ఐదోరోజు భారత బౌలర్లు సులభంగానే చుట్టేస్తారని అభిమానులు భావించారు. కానీ అనూహ్యంగా న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ పోరాట పటిమను చూపుతూ లక్ష్యం వైపుకు దూసుకువెళ్తున్నారు. Read Also: టికెట్ రేట్లపై నాని కౌంటర్ ఐదో రోజు తొలి సెషన్‌లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా…
తెలంగాణ ఆర్టీసీ దూకుడు మీద ఉంది. పోలీస్ శాఖలో తనదైన ముద్ర వేసిన సజ్జనార్ ఆర్టీసీలోనూ తన మార్క్ చూపిస్తున్నారు. తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీని క్రమంగా ప్రజలకు చేరువ చేస్తూ లాభాల బాట ఎక్కించేందుకు సజ్జనార్ ఎన్నో వినూత్న చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. అంతేకాకుండా పలుమార్లు స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొత్త సర్వీసులు, ట్రిప్పులతో ప్రజలకు ఆర్టీసీని…
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే లోక్‌సభ అట్టుడికిపోయింది. వ్యవసాయ సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టగా… వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలని, ప్రశ్నోత్తరాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విపక్షాల ఎంపీలు పట్టుబట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే సభలో విపక్షాల ఎంపీలు నిరసనలు తెలుపుతుండగానే సాగుచట్టాల రద్దు బిల్లును కేంద్రమంత్రి తోమర్ ప్రవేశపెట్టగా.. ఈ బిల్లుపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ఈ వినతిని తోసిపుచ్చిన లోక్‌సభ…
మద్యం తాగితే మనుషులు పశువుల్లా ప్రవర్తిస్తారని చెప్పడానికి ఏపీలో జరిగిన ఓ ఘటన తార్కాణంగా నిలుస్తోంది. ప్రస్తుత కాలంలో పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా మద్యానికి బానిసలు అవుతున్నారు. చదువు, సంధ్య లేకుండా బలాదూర్ తిరుగుతూ జల్సాలకు అలవాటు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో పదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలుడు కూడా మద్యానికి అలవాటుపడ్డాడు. దీంతో స్నేహితులతో ప్రతిరోజూ మద్యం తాగుతూ దొంగతనాలు కూడా చేస్తున్నాడు. Read Also: రాజధాని…
తమిళనాడులోని వెల్లూరులో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో పలుచోట్ల భూమి బీటలు వారడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీంతో నిద్రపోతున్న ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 3.6గా తీవ్రత నమోదైందని అధికారులు వెల్లడించారు. వెల్లూరుకు 59 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉందని వారు తెలిపారు. భూ అంతర్భాగంలో 25 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ అధికారులు పేర్కొన్నారు. అయితే భూకంపం వల్ల…
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పెరుగుతున్న సమయంలో ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు మెట్రోరైలు అడుగుపెట్టింది. ప్రయాణికుల సమయం ఆదా చేయడం, కాలుష్యం తగ్గించడం, సౌర విద్యుత్ వినియోగం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రవేశించింది. ఈ నేపథ్యంలో తన పరుగులు మొదలుపెట్టి హైదరాబాద్ మెట్రో నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. 2017 నవంబర్ 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా మెట్రో రైలు తొలిదశ ప్రారంభమైంది. మొత్తం మూడు మార్గాల్లో నాలుగు దశల్లో మొత్తం…