తెలంగాణ ఆర్టీసీ దూకుడు మీద ఉంది. పోలీస్ శాఖలో తనదైన ముద్ర వేసిన సజ్జనార్ ఆర్టీసీలోనూ తన మార్క్ చూపిస్తున్నారు. తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీని క్రమంగా ప్రజలకు చేరువ చేస్తూ లాభాల బాట ఎక్కించేందుకు సజ్జనార్ ఎన్నో వినూత్న చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. అంతేకాకుండా పలుమార్లు స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొత్త సర్వీసులు, ట్రిప్పులతో ప్రజలకు ఆర్టీసీని మరింత చేరువ చేస్తున్నారు.
Read Also: టీఆర్‌ఎస్‌లో అందరూ భజన పరులే : ఈటల రాజేందర్
సోషల్ మీడియా ద్వారా 81 రోజుల వ్యవధిలో 370 ఫిర్యాదులు రాగా వాటిలో 364 సమస్యలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరిష్కరించారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థుల నుంచి వచ్చిన వినతులను ప్రత్యేకంగా పరిశీలించి 151 కొత్త సర్వీసులను ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు కొత్త సర్వీసులు 1934 ట్రిప్పులను పూర్తిచేసుకున్నాయి. తక్కువ వ్యవధిలో రవాణా సేవల పునరుద్ధరణలో ఎండీ, అధికారులు, ఉద్యోగులు చూపిన నిబద్ధతను ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి ఒక ప్రకటన ద్వారా అభినందించారు. శభాష్ సజ్జనార్ అంటూ ఆయనతో పాటు ఉద్యోగులపై ప్రశంసలు కురిపించారు.