మద్యం తాగితే మనుషులు పశువుల్లా ప్రవర్తిస్తారని చెప్పడానికి ఏపీలో జరిగిన ఓ ఘటన తార్కాణంగా నిలుస్తోంది. ప్రస్తుత కాలంలో పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా మద్యానికి బానిసలు అవుతున్నారు. చదువు, సంధ్య లేకుండా బలాదూర్ తిరుగుతూ జల్సాలకు అలవాటు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో పదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలుడు కూడా మద్యానికి అలవాటుపడ్డాడు. దీంతో స్నేహితులతో ప్రతిరోజూ మద్యం తాగుతూ దొంగతనాలు కూడా చేస్తున్నాడు.
Read Also: రాజధాని రైతులకు వైసీపీ ఎమ్మెల్యే సంఘీభావం
ఇటీవల సదరు బాలుడు పుట్టినరోజు కావడంతో స్నేహితుడితో కలిసి ఫుల్లుగా మద్యం సేవించాడు. అయితే చిన్నవయసులోనే బాలుడు మద్యం తాగడం అతడి బామ్మకు నచ్చలేదు. దీంతో బామ్మ నాగమ్మ (73) తన మనవడిని, అతడి స్నేహితుడిని తీవ్రంగా మందలించింది. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో ఉన్న బాలుడు తన స్నేహితుడితో కలిసి బామ్మను దారుణంగా హత్య చేశారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.