నేడు శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం నుంచి గందరగోళ వాతావరణంలోనే సాగింది. విపక్షాల వ్యతిరేక నినాదాలతో విసుగు చెందిన రాజ్యసభ చైర్మన్ 12 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ.. సభను రేపటి వాయిదా వేశారు. అనంతరం పలువురు ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయబచ్చన్ మాట్లాడుతూ.. నేను పార్లమెంట్‌కు చాలా సంవత్సరాల నుంచి వస్తున్నానని, కానీ ఈ రకమైన వాతావరణాన్ని చూడటం ఇదే మొదటిసారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
పూర్తి గందరగోళంలో బిల్లు ఆమోదించబడిందని, చిన్న పార్టీలకు మాట్లాడే అవకాశం లేదని ఆమె అన్నారు. అంతేకాకుండా పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు జరుగుతున్న నష్టాలులతో పాటు పెరుగుతున్న కూరగాయల ధరలు గురించి మాట్లడాలన్నారు. దేశవ్యాప్తంగా నీరు, గాలి కలుషితమవుతోందని ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? మనం ఎలా తింటాము? మనం ఎలా జీవిస్తాం? అంటూ ఆమె కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.