ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసులో భారత్‌ను పాకిస్థాన్ అధిగమించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో పాకిస్థాన్ ఖాతాలో 12 పాయింట్లు చేరడంతో ఆ జట్టు మొత్తం పాయింట్ల సంఖ్య 24కి చేరింది. బంగ్లాదేశ్‌పై టెస్టు గెలిచిన తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ రెండో స్థానానికి చేరుకుంది. అయితే పాకిస్థాన్ కంటే భారత్‌కు ఎక్కువ పాయింట్లు ఉన్నా విన్నింగ్ పర్సంటేజీలో మాత్రం వెనుకబడి…
గుండెపోటుతో మృతిచెందిన తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నివాళులు అర్పించారు. అనంతరం శేషాద్రి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన శేషాద్రి ఇక లేరన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని తెలిపారు. శేషాద్రి స్వామితో తనకు 25 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. శేషాద్రి మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని ఎన్వీ రమణ…
నిబంధనలను ఉల్లంఘించినందుకు యూనియన్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ జరిమానా విధించింది. ఇటీవల యూనియన్ బ్యాంక్‌కు సంబంధించి 2019 స్టాట్యూటరీ ఇన్‌ఫెక్షన్ ఫర్ సూపర్‌వైజరీ ఎవాల్యూయేషన్‌ను ఆర్‌బీఐ నిర్వహించింది. ఆర్‌బీఐ నిబంధనల్లో భాగంగా ఏ బ్యాంకు అయినా కస్టమర్లతో కుదుర్చుకున్న ఒప్పందాలను లేదా లావాదేవీలకు సంబంధించిన అంశాలను బహిర్గతం చేయడానికి వీల్లేదు. Read Also: కేవలం 35 పైసలుతో రూ.10 లక్షల ఇన్సూరెన్స్ పొందండి అయితే యూనియన్ బ్యాంక్ ఈ నిబంధనలను ఉల్లంఘించడంతో రూ.కోటి…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని… దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని అబద్ధాలు ఆడరని ఆమె మండిపడ్డారు. మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారంటూ విమర్శలు చేశారు. రైతుల వడ్లు కొనుగోలు చేయకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. సీఎం కేసీఆర్ తన భాష మార్చుకోకుంటే ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. Read Also: వడ్ల…
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ మరో అరుదైన రికార్డు సాధించాడు. ఫుట్‌బాల్ ఆటలో ప్రతిష్టాత్మక బాలన్ డార్ అవార్డును ఏడుసార్లు అందుకుని మెస్సీ చరిత్ర సృష్టించాడు. ఇటీవల జరిగిన కోపా అమెరికా టోర్నీలో 34 ఏళ్ల మెస్సీ తమ దేశ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ టోర్నీ ఫైనల్‌లో బ్రెజిల్‌పై అర్జెంటీనా 1-0 తేడాతో టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో 28 ఏళ్ల తర్వాత అర్జెంటీనాకు మెస్సీ మెగా టోర్నీ టైటిల్ అందించాడు. Read Also:…
రైలు ప్రయాణం చేయాలంటే ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన చోట సీటును ఎంచుకునే సౌకర్యం ఉంది. రైలు ప్రయాణంలో రుచికరమైన ఆహారాన్ని కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. అయితే మీ రైలు ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో భారతీయ రైల్వే 35 పైసలకే రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇస్తుందన్న సంగతి మీకు తెలుసా? ఐటీఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో భారతీయ రైల్వే కేవలం 35…
కరోనా వైరస్‌కు మందు తయారుచేసిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన త్వరలోనే రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆనందయ్య స్వయంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆనందయ్య సోమవారం నాడు విశాఖ జిల్లా అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. Read Also: మంచి మనసు చాటుకున్న టీమిండియా కోచ్ ద్రవిడ్ అనంతరం ఆయన…
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. కాన్పూర్ టెస్టు కోసం స్పోర్టింగ్ పిచ్ తయారుచేసిన పిచ్ క్యూరేటర్ శివకుమార్ బృందానికి రూ.35వేలు బహుమతిగా ఇచ్చాడు. ఓ జట్టుకు అనుకూలంగా లేకుండా మంచి పిచ్ తయారుచేసినందుకు పిచ్ క్యూరేటర్, గ్రౌండ్‌మెన్‌కు రాహుల్ ద్రవిడ్ అభినందనలు తెలిపాడు. స్పోర్టింగ్ పిచ్ వల్లే భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు ఆసక్తికరంగా సాగింది. చివరిరోజు నాటకీయ పరిణామాల మధ్య టెస్టు డ్రాగా ముగిసినా…
భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుపతిలో కూడా మునుపెన్నడూ చూడనటువంటి వరదలు తలెత్తాయి. వరద ప్రభావిత ప్రాంతాలపై ఇప్పటికే ఆరా తీసిన సీఎం జగన్ ఈనెల 2న స్వయంగా తానే జనం దగ్గరకు వెళ్లనున్నారు. నేరుగా వరద బాధితులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇప్పటికే పంట, ప్రాణ నష్టం పై వివరాలను జగన్ తీసుకున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని…
హైదరాబాద్ నగల వ్యాపారి సంజయ్ కుమార్ అగర్వాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఘన్ శ్యాందాస్ జెమ్స్ అండ్ జ్యువెల్లర్స్ నిర్వాహకుడు సంజయ్ కుమార్ అగర్వాల్ సుంకం లేని బంగారాన్ని అక్రమ చెలామణి చేశారని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కోల్‌కతా ఈడీ అధికారులు డీఆర్ఐ కేసు ఆధారంగా విచారణ జరుపుతున్నారు. పుణెలో సంజయ్ కుమార్ ను అరెస్టు చేసి కోల్‌కతా కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. కోర్టు అనుమతితో కోల్ కతా ఈడీ…