విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా వైపు పయనిస్తోందని కాగ్ నివేదిక చెబుతున్నందున.. ఇప్పటికైనా మేధావులు స్పందించాలని అమరావతి ఛార్టర్డ్ అకౌంటెంట్స్ సంఘం కోరింది. రానున్న తరాలకు ఆస్తులకు బదులు అప్పులు ఇచ్చే దుస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న అప్పులు మూల వ్యయాలకు కాకుండా.. రోజువారీ ఖర్చులకు సరిపోతున్నాయని, అప్పులు చెల్లించడానికి ప్రభుత్వం తిరిగి అప్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అమరావతి ఛార్టర్డ్ అకౌంటెంట్స్ సంఘం అధ్యక్షుడు నేతి ఉమామహేశ్వరరావు…
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి గుండెపోటుతో సోమవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే ఆయన కన్నుమూశారని సన్నిహితులు వెల్లడించారు. డాలర్ శేషాద్రి విశాఖలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లగా ఈ ఘటన జరిగింది. 1978వ సంవత్సరం నుంచి శ్రీవారి సేవలో డాలర్ శేషాద్రి పాల్గొంటున్నారు. 2007లో రిటైర్మెంట్ అయినా….శేషాద్రి సేవలు టీటీడీకి తప్పనిసరి కావడంతో ఓఎస్‌డీగా కొనసాగుతున్నారు. మరణించే చివరి క్షణం వరకు శ్రీవారి సేవలో ఆయన తరించారు. కాగా డాలర్…
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో ఆదివారం రాత్రి మృతిచెందారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా శివశంకర్ మాస్టర్ మృతి పట్ల స్పందించారు. శివశంకర్ మాస్టర్ మృతి నన్ను కలిచివేసిందని… ఆయన మరణం కేవలం నృత్య కళా రంగానికే కాదు, యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు అని చిరంజీవి అభిప్రాయపడ్డారు. శివశంకర్ మాస్టర్‌తో తనకున్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. Read Also: బహుముఖ ప్రజ్ఞాశాలి.. శివశంకర్…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల కిందట ఏపీ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ వాస్తవానికి ఈనెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలాన్ని పొడిగించాలంటూ నవంబర్ తొలివారంలో సీఎం జగన్ కార్యాలయం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. Read Also: అనాధ…
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘పుష్ప’. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తొలి భాగం ‘పుష్ప ది రైజ్’ పేరుతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని డిసెంబర్ 17న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ మేరకు సోమవారం నాడు ‘పుష్ప ది రైజ్’ ట్రైలర్‌ను ఎప్పుడు విడుదల చేసేది ప్రకటించబోతున్నామంటూ…
అమెరికాలో జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో సూర్యాపేట వాసి మృతి చెందాడు. దీంతో సూర్యాపేట పట్టణంలో విషాదం నెలకొంది. అమెరికాలోని ఒహయో స్టేట్ ప్రాంతంలో జాబ్ చేస్తున్న సూర్యాపేట వాసి చిరుసాయి ఉద్యోగం అయిపోగానే కారులో రూమ్‌కు వెళ్తున్న సమయంలో టిప్పర్ ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే చిరుసాయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో చిరుసాయితో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి కోమాలోకి వెళ్లిపోయాడు. Read Also: న్యూ ట్రెండ్… సైకిల్‌పై పెళ్లి మండపానికి వెళ్లిన హైదరాబాదీ వరుడు అయితే ఈ…
దక్షిణాఫ్రికాలో కోవిడ్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలు ఒక్కసారి ఉలిక్కిపడ్డాయి. ఇప్పటికే కరోనా వేరియంట్లతో సతమతమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరో వేరియంట్ గందరగోళాన్ని సృష్టిస్తోంది. ప్రధాని మోడీ కూడా దీనిపై సమీక్ష నిర్వహించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కొత్త వేరియంట్‌పై ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంతి హరీష్‌రావు వైద్యాశాఖ ఉన్నతాధికారులతో ఈ రోజు రెండు గంటల పాటు…
హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత ఒక్కసారి తెలంగాణాలో రాజకీయ సమీకరణాలు మారాయి. దుబ్బాక ఉప ఎన్నికతో టీఆర్ఎస్ అలర్ట్ అయినా జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చేసరికి జరగాల్సిన నష్టం టీఆర్ఎస్ జరిగింది. దుబ్బాక ఎన్నికతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు సింహభాగాన గెలిచి మళ్లీ హైదరాబాద్ పీఠంపై గులాబీ జెండాను ఎగరవేశారు. అయితే ఆ తరువాత జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక ఈటల రాజేందర్‌తో పోటీ కారణంగా ప్రత్యేకతను సంతరించుకుంది. హుజురాబాద్ లో…
తెలంగాణలో స్థానిక సంస్థల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన కరీంనగర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రెండు ప్రధాన పక్షాలు అభ్యర్థులను నిలబెట్టడం లేదని చెప్పడం జరిగిందని, టీఆర్ఎస్ అభ్యర్థులు గా భాను ప్రసాద్, ఎల్ రమణ లు ఉన్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నా ఈటల రాజేందర్…
కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. గుండెనొప్పితో ఓ వ్యక్తి డాక్టర్ లక్ష్మణ్ దగ్గరకు వచ్చాడు. అయితే ఈ నేపథ్యంలో డాక్టర్ లక్ష్మణ్ పేషెంట్‌కు చికిత్స చేస్తుండగా ఉన్నట్టుండి డాక్టర్ లక్ష్మణ్ కూడా గుండెపోటు వచ్చింది. దీంతో డాక్టర్ లక్ష్మణ్‌తో పాటు, పేషెంట్ ఇద్దరూ మృతి చెందారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.