ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని కేసీఆర్ ఎండగట్టారు. కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. 700 మందిని పొట్టనపెట్టుకున్న హంతక పార్టీ బీజేపీ అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్రాన్ని ఒప్పించే దమ్ములేక తెలంగాణ బీజేపీ నేతలు నాటకాలు ఆడుతున్నారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి సిపాయిలా పోరాడి కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయించాలంటూ సవాల్ విసిరారు. బీజేపీ హయాంలో అన్నపురాశులు ఒకవైపు.. ఆకలి కేకలు ఇంకోవైపుగా పరిస్థితి ఉందని ఆయన…
ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సోమవారం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం తన సామాజిక బాధ్యతను విస్మరించిందని అన్నారు. రైతు, పేదల వ్యతిరేక విధానాలను కేంద్రం అవలంభిస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా దేశ ఆహార భద్రత కోసం బఫర్ స్టాక్స్ పెడుతుందని, రాజ్యాంగం ప్రకారం కేంద్రంపై బాధ్యత ఉందన్నారు. కోట్ల మంది బాధ్యతలను చూసే కేంద్రం చిల్లర కొట్టు యజమానిలా వ్యవహరించకూడదని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం దేశ రైతుల్నే గందరగోళంలోకి…
ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నెక్ట్స్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ కుప్పంలో ఆయన అభిమానులు ఫ్లెక్సీలు కట్టి సందడి చేశారు. దీంతో ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ సంఘం అధ్యక్షుడు శివ పీసీ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని, టీడీపీకే పనిచేస్తున్నామని కుప్పం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలిపారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతోనే సీఎం ఎన్టీఆర్ అనే…
ఏపీ ప్రభుత్వం నేడు ‘దేశీ 2021 మేకిన్ ఆంధ్రప్రదేశ్ వర్క్ షాప్’ అనే కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రిలు మేకపాటి గౌతమ్ రెడ్డి, అవంతి శ్రీనివాస్‌లు హజరయ్యారు. వీరితో పాటు డీఆర్‌డీవో చైర్మన్ సతీష్ రెడ్డి, ఐటీ శాఖ అధికారులు వివిధ రంగాల ప్రముఖులు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని వాటిపై చర్చించినట్లు తెలిపారు.…
మరోసారి ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్. ఇప్పటికే పలు దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా ఒమిక్రాన్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోందని దీని పై సీఎం సమీక్ష చేపట్టారని వెల్లడించారు. ఒమిక్రాన్ వస్తే ఏం చేయాలనే అంశంపై సీఎం సూచనలు చేశారని ఆయన తెలిపారు.…
గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోన్న కరోనా మహామ్మరి కొత్తగా ఓమిక్రాన్ రూపంలో మరోసారి దేశాలను భయపెడుతోంది. దక్షిణాఫ్రికాలో ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు దీని వ్యాప్తి చాలా వేగంగా ఉందని తెలిపారు. అయితే దీనిపై ఇప్పటికే పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. విమాన ప్రయాణాలను సైతం రద్దు చేస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా సమీక్ష నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన…
ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద హత్యకేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి వివేకా హత్య కేసుతో నాకు సంబంధం లేదంటూ అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పను ఆశ్రయించాడు. రూ.10 కోట్లు సుపారీ తీసుకొని అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డిలు నాతో వివేకా హత్య చేయినట్లు చెప్పాలంటూ వివేకా కుమార్తె సునీత, సీబీఐ, మడకశిర ఎస్సై, సీఐ శ్రీరామ్ లు నన్ను వేధిస్తున్నారని గంగాధర్ రెడ్డి ఎస్పీకి వెల్లడించారు. అంతేకాకుండా నాకు, నా…
నేడు శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం నుంచి గందరగోళ వాతావరణంలోనే సాగింది. విపక్షాల వ్యతిరేక నినాదాలతో విసుగు చెందిన రాజ్యసభ చైర్మన్ 12 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ.. సభను రేపటి వాయిదా వేశారు. అనంతరం పలువురు ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయబచ్చన్ మాట్లాడుతూ.. నేను పార్లమెంట్‌కు చాలా సంవత్సరాల నుంచి వస్తున్నానని, కానీ ఈ రకమైన వాతావరణాన్ని చూడటం ఇదే మొదటిసారని ఆమె అభిప్రాయం వ్యక్తం…
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే సభ ప్రారంభం నుంచి విపక్షాలు కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వ్యవసాయ చట్టాలపై చర్చించాలంటూ నినదించారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పలు మార్లు సభ వాయిదా పడింది. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో మరోసారి గందరగోళం ఏర్పడడంతో రాజ్యసభ చైర్మన్ 12 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఎలమరం కరీం – సీపీఎం, బినోయ్ విశ్వం –…