జమ్మూకాశ్మీర్ మంచు సోయగాలను చూసేందుకు అందరికీ ఆసక్తిగానే ఉంటుంది. అయితే శనివారం జమ్మూకాశ్మీర్ టూరిజం రోడ్‌షో నిర్వహించింది. ఈ సందర్భంగా పట్నిటాప్ టూరిజం డెవలప్‌మెంట్ అథారిటీ సీఈఓ షేర్ సింగ్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం జూన్ నుండి ఇప్పటివరకు 5.5 లక్షల మంది దేశీయ పర్యాటకులు జమ్మూకాశ్మీర్‌ను సందర్శించారని, వీరిలో 10 శాతం మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. జమ్మూకాశ్మీర్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిందని ఆయన అభిప్రాయం వ్యక్తం…
తెలంగాణలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్ నుంచి కోలుకుంటున్న తెలంగాణ రాష్ట్ర మళ్లీ కరోనా కోరల్లో చిక్కుకుంటోంది. అయితే తాజాగా హైదరాబాద్ రాజేంద్రనగర్ లో గల పీరంచెరువు సమీపంలో ఉన్న ఒకే అపార్ట్‌మెంట్‌లో 10మంది కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. దీంతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది. అయితే ఈ అపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక వ్యక్తి ఇటీవల దేశరాజధాని ఢిల్లీకి వెళ్లొచ్చాడు. అయితే అతని ద్వారా మిగితా వారికి కరోనా సోకినట్లు అధికారులు…
దక్షిణాఫ్రికాలో గత 15 రోజుల క్రితం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్ నుంచి భారత్‌తో పాటు పలు దేశాలు కోలుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్ బయటపడడంతో మరోసారి యావత్త ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. డెల్టావేరియంట్ కంటే 6రెట్లు వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తుండడం ఆందోళన కలిగించే విషయం. ఇప్పటికే పలు దేశాల్లో రోజు పదుల సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. అయితే భారత్‌లో కూడా ఒమిక్రాన్ తన ఉనికిని చూపెడుతోంది.…
మాదాపూర్ విఠల్‌రావు నగర్ లోని అలియన్స్ బ్లెండెడ్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న ఆన్గ్మీట్ లెప్చా (39) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. బ్యూటీషన్ గా పనిచేస్తున్న లెప్చా తాను ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి స్వస్థలం డార్జిలింగ్.. ఇద్దరు పిల్లలు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. భర్త తో ఉన్న విభేదాల తోనే మనస్థాపానికి గరై బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కె.రోశయ్య ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో రోశయ్య మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి, గీతారెడ్డిలు రోశయ్య కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. రోశయ్య మృతి చెందడం చాలా బాధకరమని, సుదీర్ఘ రాజకీయ అనుభవంలో.. ఎక్కడా మచ్చ తెచ్చుకోలేదు ఆయన అన్నారు. ఆర్థిక సమస్యలపై ఎంతో పట్టు…
యావత్తు ప్రపంచ దేశాల్లో అల్లకల్లోలం సృష్టించిన కరోనా మహమ్మారి మరోసారి రూపాంతరం చెంది విజృంభిస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్ నుంచి కొలుకుంటున్న దేశాలు, దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పేరువినగానే భయాందోళనకు గురవుతున్నాయి. డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండటంతో ఇప్పటికే పలు దేశాలలో వ్యాప్తి చెందింది. ప్రపంచ వ్యాప్తంగా 719 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్లు డబ్లూహెచ్‌వో వెల్లడించింది. ఈ వేరియంట్ ఇటీవలే ఇండియాలోకి…
యూకేకు చెందిన కర్రీస్ పీసీ వరల్డ్ అనే సంస్థ ఎలక్ట్రానిక్ రీసైక్లింగ్ గురించి అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టింది. స్థానిక కౌన్సిల్‌లు, సేవలు, రిటైలర్లు ఉచిత సేకరణ మరియు డ్రాప్-ఆఫ్ సేవలను అందిస్తున్నప్పటికీ, దాదాపు 68% మంది బ్రిటీష్ ప్రజలు తమ ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎక్కడ మరియు ఎలా పారవేయాలనే దానిపై అయోమయంలో ఉన్నారని కంపెనీ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో కర్రీస్ ప్రెస్టన్ స్టోర్ మేనేజర్ డారెన్ కెన్‌వర్తీ ప్రజలకు…
గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయంటూ రైతులు, విపక్ష నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దాదాపు సంవత్సరం పాటు రైతులు దేశరాజధాని ఢిల్లీలో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యం ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా శీతకాల పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కె.రోశయ్య ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. రోశయ్య మృతిపట్ల రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోశయ్య కుమారుడికి ఏపీ సీఎం జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. అంతేకాకుండా రోశయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాటి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో రోశయ్యది ఆదర్శప్రాయమైన జీవితమని, ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు అని సీఎం జగన్ పేర్కొన్నారు. రోశయ్య మృతిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే…
పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అటవీ గ్రామాలలో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు.. కొయ్యూరు అటవీ ప్రాంతం నుండి మంథని మండలంలోని అడవి సోమనపల్లి గ్రామ పరిధిలో గల అటవీ ప్రాంతానికి పులి వచ్చినట్లు వారు తెలిపారు.అడవి సోమనపల్లి, వెంకటపూర్, అరేంద, ఖానాపూర్, కాన్సాయి పేట గ్రామస్తులు, ఎడ్ల, గొర్ల, బర్ల కాపరులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ గ్రామ…