యావత్తు ప్రపంచ దేశాల్లో అల్లకల్లోలం సృష్టించిన కరోనా మహమ్మారి మరోసారి రూపాంతరం చెంది విజృంభిస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్ నుంచి కొలుకుంటున్న దేశాలు, దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పేరువినగానే భయాందోళనకు గురవుతున్నాయి. డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండటంతో ఇప్పటికే పలు దేశాలలో వ్యాప్తి చెందింది.
ప్రపంచ వ్యాప్తంగా 719 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్లు డబ్లూహెచ్‌వో వెల్లడించింది. ఈ వేరియంట్ ఇటీవలే ఇండియాలోకి కూడా ఎంటరైంది. కర్ణాటకలోని బెంగుళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్ లక్షణాలు బయటపడ్డ విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో కేసు గుజరాత్‌లో బయటపడింది. దక్షిణాఫ్రికా నుంచి గుజరాత్‌కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.