మాదాపూర్ విఠల్‌రావు నగర్ లోని అలియన్స్ బ్లెండెడ్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న ఆన్గ్మీట్ లెప్చా (39) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. బ్యూటీషన్ గా పనిచేస్తున్న లెప్చా తాను ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి స్వస్థలం డార్జిలింగ్.. ఇద్దరు పిల్లలు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. భర్త తో ఉన్న విభేదాల తోనే మనస్థాపానికి గరై బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.