కరోనా మహమ్మారి జర్మనీలో విజృంభిస్తోంది. ఇప్పటికే జర్మనీలో కోవిడ్ తీవ్ర రూపం దాల్చింది. దీంతో రోజుకు 76 వేల పై చిలుకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ జర్మనీలో ప్రవేశించింది కూడా. దీంతో ప్రజల్లో మరింత భయం నెలకొంది. తాజా కేసులతో అక్కడి ఆసుపత్రులన్ని కిక్కిరిసిపోవడంతో ఏకంగా వైమానిక దళాన్ని కూడా జర్మనీ ప్రభుత్వం రంగంలోకి దింపింది. అంతేకాకుండా కరోనా కట్టడికి షరతులతో కూడిన లాక్‌డౌన్‌ను కూడా విధిస్తున్నట్లు…
ఉత్తరాంధ్ర, ఒడిషాల వైపు జవాద్ తీవ్ర తుఫాన్ ముప్పు ముంచుకు వస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ రోజు అర్ధరాత్రి వాయుగుండం ఏర్పడనుంది. ఆ తర్వాత 24గంటల్లో తుఫాన్ గాను అనంతరం తీవ్ర తుఫాన్ గాను మారుతుంది. ఇప్పటికి ఉన్న అంచనా ప్రకారం ఈ తుఫాన్ ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులతో ప్రయాణిస్తుంది. దీని ప్రభావం వల్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోని పర్యాటక ప్రదేశాలు 3రోజుల…
ప్రపంచ దేశాలతోపాటు అగ్రరాజ్యమైన అమెరికాను సైతం గడగడలాడించింది కరోనా మహమ్మారి. కరోనా ధాటికి ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. కరోనా సోకి ఇంటి పెద్దలు మృతి చెందడంతో చాలా మంది చిన్నారులు అనాథలు మారారు. కరోనా రూపాంతరం చెంది డెల్టా వేరియంట్‌గా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో కరోనాను ఎదుర్కునేందుకు ఎంతో శ్రమించి శాస్త్రవేత్తలు కోవిడ్ వ్యాక్సిన్లను కనుగొన్నారు. అయితే కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నమ్మి ప్రజలు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.…
యావత్తు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన కరోనా మహమ్మరి రూపాంతరం చెంది మరోసారి విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు పలు దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. నేడు ఇండియాలో కూడా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం గమనార్హం. అయితే తాజాగా ఒమిక్రాన్‌పై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) పలు సూచనలు చేసింది. దక్షిణాఫ్రికాలోని యువత తీవ్ర లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారని వెల్లడించింది. కరోనా వేరియంట్లతో పొల్చితే…
ఇప్పటికే కరోనా డెల్టా వేరియంట్‌లతో అతలాకుతలమవుతున్న ప్రపంచ దేశాలు.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఒమిక్రాన్‌ను అడ్డుకునేందుకు ఇప్పటికే వివిధ దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అంతేకాకుండా ఒమిక్రాన్‌పై దృష్టి సారించి ముందస్తు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో కూడా తాజాగా రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఒమిక్రాన్ సోకిన ఇద్దరు కర్ణాటకలోని బెంగూళూరు ఎయిర్‌పోర్టులో నవంబర్ 11న ఒకరు,…
తవ్వకాల్లో బయటపడిన వస్తువులపై అందరికీ ఆసక్తి ఉంటుంది. అలాగే అవి ఎక్కడ బయటపడ్డాయని తెలుసుకునేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే తాజాగా పురాతన నాణేలతో నిండిన కుండ ఒకటి బయట పడింది. ఎక్కడంటే మధ్య ప్రదేశ్‌లోని టికామ్‌ఘర్ జిల్లాలో. అయితే టికామ్‌ఘర్ పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో గల నందన్‌వారా గ్రామంలోని మట్టి క్వారీలో మంగళవారం ఉదయం జేసీబీతో మట్టిని తవ్వుతున్న సమయంలో ఒక కుండ కార్మికులకు కనిపించింది. దీంతో కార్మికులు ఆ కుండను బయటకు తీశారు. అందులో…
కరోనా మహమ్మరి ప్రపంచాన్ని వదలనంటోంది. గత సంవత్సరంలో జనవరి 30న కరోనా కేసు కేరళలో నమోదైంది. అయితే అప్పటి నుంచి భారత్‌ను వణికిస్తున్న కరోనా మహమ్మరిని ఎదుర్కునేందుకు శాస్త్రవేత్తలు శ్రమించి కోవిడ్ టీకాలను కనుగోన్నారు. దీంతో ఇప్పుడిప్పుడే కరోనా రక్కసి ప్రభావం ఇండియాపై తగ్గుతున్న తరుణంలో దక్షిణాఫ్రికాలో మరో కరోనా వేరియంట్ బయటపడింది. ఈ వేరియంట్ వెలుగులోకి వచ్చి 10 రోజులే అవుతున్నా దీని వ్యాప్తి మాత్రం కరోనా డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు అధికంగా…
మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతో ఏపీలోని పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చి సహాయక చర్యలు అందించారు. వాగులు, వంకలు పొంగిపొర్లి వరద నీరు గ్రామాల్లోకి చేరింది. అంతేకాకుండా చెరువులకు గండ్లు పడడంతో కట్ట కింద ఉన్న పంటపొలాలు కొట్టుకుపోయాయి. పశువులు కూడా కొట్టుకుపోయి తీవ్ర ఆస్తినష్ట, ప్రాణ నష్టం కూడా సంభవించింది. దీంతో సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు,…
ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. కొన్ని సార్లు మన తప్పదం లేకుండానే ప్రమాదాలు సంభివిస్తే.. కొన్ని సార్లు నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు సంభవిస్తుంటాయి. అలాంటి ఘటనే ఇది. శ్రీశైలం ఘాట్ రోడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే.. శ్రీశైలం కొండపైకి వెళ్లేందుకు మలుపుతో ఉన్న రహదారిలో వెళ్లాల్సి ఉంటుంంది. అయితే అప్పటికీ ప్రమాదాలకు సంభవించకుండా ఉండేందుకు అధికారులు రాత్రి సమయం నుంచి ఉదయం వరకు శ్రీశైలంపైకి రాకపోకలు నిలిపివేస్తుంటారు. అయితే తాజాగా ఓ యువతి బస్సులో…
ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించిన 3 రాజధానుల బిల్లు గత అసెంబ్లీ సమావేశాలలో రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై సీఎం జగన్ మాట్లాడుతూ.. 3 రాజధానుల నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోలేదని, కొన్ని సవరణలతో మళ్లీ బిల్లును ప్రవేశపెడుతామని అప్పుడే చెప్పారు. దీంతో 3 రాజధానుల బిల్లు రద్దు చేస్తారనుకున్న వారితో మళ్లీ ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మళ్లీ 3 రాజధానుల వచ్చే బడ్జెట్ సమావేశాల్లో…