తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు త్వరలో నగరంలోని ప్రధాన ప్రదేశాలలో వక్ఫ్ ఆస్తుల అభివృద్ధిని చేపట్టేందుకు తన ప్రణాళికలను ఖరారు చేయనుంది. ప్రైవేట్ సంస్థల సహకారంతో బోర్డు దాని స్థలాల ద్వారా మరింత ఆదాయాన్ని సంపాదించడానికి షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాల్స్, ఇతర వాణిజ్య స్థలాల నిర్మాణాన్ని చేపట్టనుంది. దీని ద్వారా వచ్చే ఆదాయంతో మైనార్టీల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపడతామన్నారు. గతంలో దీనిపై ప్రణాళికలను సిద్ధం చేశామని, రానున్న బోర్డు సమావేశంలో మమ్మల్ని సంప్రదించిన కంపెనీలను…
శీతాకాల పార్లమెంటు సమావేశాలు గత నెల 29 ప్రారంభమయ్యాయి. ప్రారంభం నుంచి విపక్షాల ఆందోళనల నడుమ నడుస్తున్న పార్లమెంట్ సమావేశాలు నేడు 6వ రోజుకు చేరుకున్నాయి. అయితే లోక్‌సభ 6వ రోజు సమావేశాలు ప్రారంభం నుంచే విపక్షాలు నాగాలాండ్ ఘటనపై చర్చించాలంటూ ఆందోళనకు దిగాయి. దీంతో మరోసారి లోకసభ వేడెక్కింది. విపక్షాల నినాదాలకు స్పందిస్తూ నాగాలాండ్ ఘటనపై హోంమత్రి ప్రకటన చేస్తారని కేంద్రం వెల్లడించింది. నాగాలాండ్ కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 17 చేరింది. ఇదిలా ఉంటే…
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నేడు 36వ రోజుకు చేరుకుంది. గత నెల 1న ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర 45 రోజుల పాటు సాగి డిసెంబర్ 15న తిరుమలలో ముగుస్తుంది. అయితే ఏపీలో ఇటీవల భారీ వర్షాలు సంభవించడంతో అమరావతి రైతుల జేఏసీ రెండు సార్లు పాదయాత్రకు విరామం ప్రకటించారు. అయితే ఊరురా రాజధాని రైతుల మహాపాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. నెల్లూరు జిల్లాలో…
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్‌నెం 2 లో అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రోహిత్ అనే వ్యక్తి తాగినమత్తులో అతివేగంగా కారు నడుపుతూ రోడ్డు దాటుతున్న ఇద్దరు యువకులను ఢీ కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. కారు దూసుకెళ్లడంతో బీహార్‌కు చెందిన త్రిభువన్‌రాయ్, ఉపేందర్‌కుమార్ దాస్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు వెంటనే రోహిత్‌ను పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రోహిత్‌ను అదుపులోకి…
నవంబర్ 28, 2019న రాత్రి ఒక వెటర్నటీ డాక్టర్‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం, హత్య చేశారో నలుగురు దుండగులు. దిశ పేరుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను ఒక్కరోజులోనే పట్టుకొని విచారణ చేపట్టారు. అయితే 2019 డిసెంబర్ 6న దిశ కేసులో సీన్ రీ కన్స్ట్రాక్షన్ చేస్తుండగా పారిపోయేందుకు నిందితులు చెన్నకేశవులు, మహ్మద్ హారీఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ ప్రయత్నించారు. అయితే ఈ నేపథ్యంలో దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దుండగులు రాళ్లు రువ్వారు.…
కరోనా మహమ్మారి విజృంభన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో మరోసారి మొదలైంది. ఇప్పటికే 38 దేశాలకు వ్యాప్తి చెందిన ఈ వేరియంట్ కొత్త నివేదికల ప్రకారం ఇప్పుడు 46 దేశాలకు పాకింది. ఇప్పుడిప్పుడే డెల్టా వేరియంట్ నుంచి కోలుకుంటన్న తరుణంలో దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా 941కి ఒమిక్రాన్ బాధితుల సంఖ్య చేరింది. యూకేలో 246 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, దక్షిణాఫ్రికాలో…
భద్రాచలం పట్టణంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లుతో స్థానికంగా కలకలం రేపుతున్నాయి.. ఎక్కువగా మావోయిస్టులు మాత్రమే పోస్టర్లను అంటించి వారి ఉద్దేశాలను తెలుపుతుంటారు. అయితే తాజాగా వెలసిన పోస్టర్లు మావోయిస్టులకు వ్యతిరేకంగా ఉండటం గమనార్హం. మావోయిస్టుల విధానాలను ప్రజలు ప్రశ్నిస్తున్నట్లుగా పట్టణంలో అక్కడక్కడ పోస్టర్లు అంటించారు. అంతేకాకుండా మావోయిస్టుల పార్టీకీ సూటి ప్రశ్నలు వేసినట్లు ఈ పోస్టర్లలో సారాంశం ఉంది. నక్సలైట్లు అంటే నరహంతకులు కాదా? అభివృద్ధిని అడ్డుకోవడం నక్సలిజమా? ప్రజా విప్లవం అంటే విధ్వంసమా? తుపాకీ…
అండమాన్‌లో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త వాయుగుండంగా బలపడి తుఫాన్‌గా మారింది. ఈ తుఫాన్‌కు జవాద్ తుఫాన్‌గా అధికారులు నామకరణం చేశారు. దీంతో ఈ జవాద్ తుఫాన్ ఎఫెక్ట్ ఉత్తరాంధ్ర, ఒడిషా రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం తీర ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా తుఫాన్ తీవ్రత తగ్గేవరకు విశాఖపట్నంలోని పర్యాటక కేంద్రాలను మూసివేస్తున్నట్లు, సందర్శకులు రావద్దంటూ ప్రకటించింది. అయితే ఇటీవల జవాద్ తుఫాన్ విశాఖపట్నంకు…
భారత్‌కు నేడు రష్యా అధ్యక్షుడు పుతిన్ రానున్నారు. 21వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో రక్షణ, ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చలు జరుగనున్నాయి. సాయంత్రం ఢిల్లీలో ప్రధాని మోడీతో పుతిన్ భేటీకానున్నారు. రాత్రి 9.30 గంటలకు పుతిన్ తిరిగి ప్రయాణం కానున్నారు. శీతాకాల పార్లమెంటు సమావేశాలు నవంబర్ 29 నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభం నుంచి విపక్షాల ఆందోళనల నడుమ నడుస్తున్న పార్లమెంట్ సమావేశాలు నేడు ఆరో రోజుకు చేరుకున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై కేంద్రం దృష్టిసారించి నేడు వ్యాక్సినేషన్…
జంటనగరాల ప్రజలను భయాందోళనకు గురిచేసిన చెడ్డీగ్యాంగ్ ఇప్పుడు ఏపీలో దోపిడీలకు తెగబడుతున్నారు. ఏపీలోని పులివెందుల నుంచి గుండుగొలను వరకు చెడ్డీగ్యాంగ్ వరుస దోపిడీలకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో దొంగతనాలు చేసిని ఈ ముఠా ఇప్పడు విజయవాడలో ప్రత్యక్షమవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చిట్టినగర్, గుంటుపల్లిలో చెడ్డీగ్యాంగ్ ముఠా దోపిడీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇటేవలే ఈ ముఠా పులివెందుల, తిరుపతి, ప్రకాశం, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో పలు దోపిడీలకు పాల్పడ్డ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే…