యూకేకు చెందిన కర్రీస్ పీసీ వరల్డ్ అనే సంస్థ ఎలక్ట్రానిక్ రీసైక్లింగ్ గురించి అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టింది. స్థానిక కౌన్సిల్‌లు, సేవలు, రిటైలర్లు ఉచిత సేకరణ మరియు డ్రాప్-ఆఫ్ సేవలను అందిస్తున్నప్పటికీ, దాదాపు 68% మంది బ్రిటీష్ ప్రజలు తమ ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎక్కడ మరియు ఎలా పారవేయాలనే దానిపై అయోమయంలో ఉన్నారని కంపెనీ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో కర్రీస్ ప్రెస్టన్ స్టోర్ మేనేజర్ డారెన్ కెన్‌వర్తీ ప్రజలకు రీసైక్లింగ్‌పై అవగాహన కల్పించాలనుకున్నారు.

ఈ విషయమై అతను పిరమిడ్‌ను రూపొందించడానికి తన యజమానులను ఒప్పించాడు. ఈ పిరమిడ్ నిర్మించడానికి ఐన్స్‌కాఫ్ ట్రైనింగ్ సర్వీసెస్ మద్దతుగా క్రేన్, భద్రతా చర్యలను అందించింది. దీంతో కర్రీస్ పీసీ వరల్డ్ సంస్థ 1,496 రీసైకిల్ వాషింగ్ మెషీన్లతో 44 అడుగుల 7 అంగుళాల పిరమిడ్‌ను నిర్మించారు. సెప్టెంబరు 2021లో నేషనల్ రీసైక్లింగ్ వీక్ సందర్భంగా అతిపెద్ద వాషింగ్ మెషీన్ పిరమిడ్‌కు ఏర్పాటు చేసిన కర్రీస్ పీసీ వరల్డ్ గిన్నిస్ రికార్డును బ్రేక్ చేసింది.